విటమిన్ 'B' పుష్కలంగా లభించే టాప్ 10 ఆహారాలు

గుడ్లలో విటమిన్ B7 (బయోటిన్), B12 పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు, చర్మ ఆరోగ్యానికి మరియు శరీర శక్తికి ఎంతో మేలు చేస్తాయి.

పాలు, పెరుగు మరియు పన్నీర్‌లో విటమిన్ B2 (రైబోఫ్లావిన్), B12 లభిస్తాయి. ఇవి ఎముకలను, కండరాలను దృఢంగా ఉంచుతాయి.

పాలకూర వంటి ఆకుకూరల్లో విటమిన్ B9 (ఫోలేట్) ఎక్కువగా ఉంటుంది. ఇది ఎర్ర రక్తకణాల ఉత్పత్తికి, గర్భిణీ స్త్రీలకు చాలా ముఖ్యం.

సాల్మన్, ట్యూనా వంటి చేపలలో విటమిన్ B3, B6, B12 లతో పాటు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ నిండి ఉంటాయి. ఇవి గుండెకు రక్షణ ఇస్తాయి.

చికెన్ మరియు లీన్ మీట్‌లో విటమిన్ B3, B6, B12 అధిక మొత్తంలో లభిస్తాయి. ఇవి నరాల బలహీనతను తగ్గిస్తాయి

బ్రౌన్ రైస్, ఓట్స్, బార్లీ వంటి వాటిలో విటమిన్ B1 (థయామిన్), B2, B3 ఉండి బాడీ మెటబాలిజాన్ని మెరుగుపరుస్తాయి.

శనగలు, రాజ్మా, మరియు వివిధ రకాల పప్పులలో విటమిన్ B9 (ఫోలేట్) పుష్కలంగా దొరుకుతుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

బాదం, వేరుశనగలు, సూర్యకాంత గింజలలో విటమిన్ B6, B7 ఉంటాయి. ఇవి మెదడు పనితీరును చురుగ్గా ఉంచుతాయి.

ఈ సూపర్ ఫుడ్‌లో విటమిన్ B3, B5, B6 లతో పాటు మంచి కొవ్వులు ఉంటాయి. ఇది చర్మాన్ని యంగ్‌గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది.

శాకాహారులకు (Vegetarians) విటమిన్ B12 లభించడం కొంచెం కష్టం. అలాంటి వారు విటమిన్ B12 బూస్ట్ ఉన్న బ్రేక్‌ఫాస్ట్ సెరల్స్ తీసుకోవచ్చు