రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ C ఆహారాలు!

విటమిన్ C కి ఇది కేరాఫ్ అడ్రస్! రోగనిరోధక శక్తిని అమాంతం పెంచడంలో, జుట్టు మరియు చర్మ ఆరోగ్యానికి ఉసిరి అద్భుతంగా పనిచేస్తుంది.

మీకు తెలుసా? నారింజ కంటే జామకాయలో విటమిన్ C రెట్టింపు స్థాయిలో ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచి, మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.

విటమిన్ C అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చే పండు నారింజ. రోజుకో కమలా పండు తింటే జలుబు, ఇన్ఫెక్షన్లు మీ దరిదాపుల్లోకి రావు

రోజు ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని తాగితే, శరీరంలోని మలినాలు తొలగిపోయి రోజంతా యాక్టివ్ గా ఉంటారు.

రుచికి మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా కివీ సూపర్ ఫుడ్. ఇది కణాలను దెబ్బతినకుండా కాపాడి తక్షణ ఎనర్జీని ఇస్తుంది.

ముఖ్యంగా పసుపు, ఎరుపు రంగు క్యాప్సికంలో విటమిన్ C పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగుపరచడానికి చాలా మంచిది.

చర్మం నిగనిగలాడాలన్నా, జీర్ణ సంబంధిత సమస్యలు పోవాలన్నా బొప్పాయి తినాలి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి

విటమిన్ C తో పాటు ఫోలేట్ ఎక్కువగా ఉండే ఈ పండ్లు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మెదడు చురుగ్గా పనిచేయడానికి కూడా సహాయపడతాయి.

కూరగాయలలో బ్రోకలీ బెస్ట్ ఆప్షన్. ఇది క్యాన్సర్ వంటి వ్యాధులతో పోరాడే శక్తిని శరీరానికి ఇస్తుంది.

మనం రోజూ వంటల్లో వాడే టొమాటోలో కూడా విటమిన్ C బాగానే ఉంటుంది. పచ్చిగా లేదా సలాడ్స్‌లో తింటే పూర్తి పోషకాలు శరీరానికి అందుతాయి.