రోజూ ఒక అరటిపండు.. 45 రోజులు తింటే శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే!

రోజూ ఉదయం ఒక అరటిపండు తినడం వల్ల శరీరానికి అవసరమైన గ్లూకోజ్ అంది, రోజంతా అలసట లేకుండా తక్షణ శక్తి లభిస్తుంది.

అరటిపండులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. 45 రోజుల పాటు క్రమం తప్పకుండా తింటే మలబద్ధకం, గ్యాస్ సమస్యలు పూర్తిగా దూరమవుతాయి.

ఇందులో ఉండే అధిక పొటాషియం రక్తపోటును (Blood Pressure) నియంత్రణలో ఉంచుతుంది. గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.

అరటిపండులోని 'ట్రిప్టోఫాన్' అనే ప్రోటీన్ సెరోటోనిన్‌గా మారి.. మీ మూడ్‌ని ఆనందంగా ఉంచుతుంది. డిప్రెషన్, ఒత్తిడి తగ్గుతాయి.

ఐరన్ లోపంతో బాధపడేవారు రోజూ అరటిపండు తింటే, రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరిగి రక్తహీనత సమస్య దరిచేరదు.

జిమ్ చేసేవారు లేదా శారీరక శ్రమ చేసేవారికి కండరాల నొప్పులు రాకుండా, కండరాలు బలంగా మారడానికి అరటిపండు అద్భుతంగా పనిచేస్తుంది.

ఇది తిన్న వెంటనే కడుపు నిండిన భావన కలుగుతుంది. దీనివల్ల జంక్ ఫుడ్ తినాలనే కోరిక తగ్గి, బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

శరీరం కాల్షియంను వేగంగా గ్రహించేలా చేయడంలో అరటిపండులోని పోషకాలు సహాయపడతాయి. దీంతో ఎముకలు బలంగా మారతాయి.

అరటిపండులో ఉండే విటమిన్ 'సి' మరియు యాంటీ ఆక్సిడెంట్లు చర్మంపై ముడతలు పడకుండా చేసి, ముఖానికి సహజమైన గ్లో తీసుకువస్తాయి.

కడుపులో మంట, ఎసిడిటీ లేదా అల్సర్లతో బాధపడేవారికి అరటిపండు ఒక సహజ ఔషధం. ఇది కడుపులో కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది.

ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో లేదా సాయంత్రం స్నాక్ సమయంలో ఒక అరటిపండు తినడం మంచిది. పరగడుపున మాత్రం తినకండి.