పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును వేగంగా కరిగించే 10 అద్భుతమైన మార్నింగ్ హ్యాబిట్స్!
నిద్రలేవగానే ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు (Toxins) బయటకు పోతాయి, జీవక్రియ (Metabolism) వేగవంతం అవుతుంది.
గోరువెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం, ఒక స్పూన్ స్వచ్ఛమైన తేనె కలుపుకుని తాగితే బెల్లీ ఫ్యాట్ త్వరగా కరుగుతుంది.
జిమ్‌కు వెళ్లకపోయినా.. ఉదయం ఇంట్లోనే కనీసం 15 నిమిషాల పాటు స్ట్రెచింగ్, స్కిప్పింగ్ లేదా సూర్యనమస్కారాలు చేయడం అలవాటు చేసుకోండి.
ఉదయం 7 నుండి 8 గంటల మధ్య వచ్చే లేత సూర్యరశ్మి శరీరానికి తగిలేలా వాకింగ్ చేయండి. విటమిన్-డి బరువు తగ్గించడంలో కీలకంగా పనిచేస్తుంది.
Learn more
ఉదయం అల్పాహారంలో గుడ్లు, మొలకలు, లేదా ఓట్స్ లాంటి ప్రొటీన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే.. రోజంతా అతిగా ఆకలి వేయదు.
ఉదయం తాగే టీ, కాఫీలలో చక్కెరను పూర్తిగా మానేయండి. దానికి బదులుగా బెల్లం లేదా తేనెను వాడటం మంచిది.
ఉదయం పాలతో చేసిన టీకి బదులుగా గ్రీన్ టీ తాగడం వల్ల అందులో ఉండే యాంటీ-ఆక్సిడెంట్లు కొవ్వును కరిగించే ప్రక్రియను వేగవంతం చేస్తాయి.
బ్రేక్‌ఫాస్ట్ చేసేటప్పుడు టీవీ లేదా మొబైల్ చూడకుండా, ఆహారాన్ని బాగా నమిలి తినడం వల్ల త్వరగా కడుపు నిండిన భావన కలుగుతుంది.
ఉదయం లేవగానే హడావిడి పడకుండా, 10 నిమిషాల పాటు ప్రశాంతంగా ధ్యానం (Meditation) చేయండి. ఒత్తిడి హార్మోన్ (కార్టిసాల్) తగ్గితే బరువు సులభంగా తగ్గుతారు.
ఆఫీస్‌లో లేదా అపార్ట్‌మెంట్‌లో లిఫ్ట్ వాడటం మానేసి మెట్లు ఎక్కడం అలవాటు చేసుకోండి. ఇది రోజూవారీ వ్యాయామంలో బెస్ట్ కార్డియో!
Learn more