ఖరీదైన బ్రౌన్ రైస్: నిజంగానే అంత ఆరోగ్యకరమా? 10 వాస్తవాలు

బ్రౌన్ రైస్‌లో తవుడు (bran), బీజం (germ) అలాగే ఉంటాయి. కాబట్టి పాలిష్ చేసిన తెల్ల బియ్యం కంటే ఇందులో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి

వైట్ రైస్‌తో పోలిస్తే బ్రౌన్ రైస్‌లో ఫైబర్ చాలా ఎక్కువ. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు గ్యాస్ట్రిక్ సమస్యలను దూరంగా ఉంచుతుంది.

బ్రౌన్ రైస్‌కి గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) తక్కువ. అంటే ఇది తిన్న వెంటనే రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరగవు. డయాబెటిస్ ఉన్నవారికి ఇది చాలా మంచిది.

ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల కొద్దిగా తినగానే కడుపు నిండిన భావన కలుగుతుంది. అతిగా తినడాన్ని తగ్గించి, బరువు నియంత్రణలో ఇది సహాయపడుతుంది.

బ్రౌన్ రైస్‌లో ఉండే మెగ్నీషియం, లిగ్నన్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అలాగే చెడు కొలెస్ట్రాల్‌ను కంట్రోల్ చేస్తాయి.

సాధారణ బియ్యం కంటే బ్రౌన్ రైస్ ప్రాసెసింగ్ కాస్త భిన్నంగా ఉంటుంది. దానికి తోడు దీని షెల్ఫ్ లైఫ్ తక్కువ (తొందరగా పాడవుతుంది), అందుకే మార్కెట్‌లో దీని ధర ఎక్కువగా ఉంటుంది.

మట్టి, నీటి నుండి బియ్యం గ్రహించే 'ఆర్సెనిక్' అనే పదార్థం వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్‌లో కాస్త ఎక్కువ ఉంటుంది. అందుకే వండేముందు దీన్ని బాగా కడగాలి.

పీచు పదార్థం వల్ల కొంతమందికి ఇది త్వరగా అరగదు. కొత్తగా బ్రౌన్ రైస్ తినడం మొదలుపెట్టే వారు, ఒకేసారి కాకుండా కొద్దికొద్దిగా అలవాటు చేసుకోవడం మంచిది.

బ్రౌన్ రైస్ గట్టిగా ఉండటం వల్ల ఉడకడానికి సాధారణం కంటే ఎక్కువ నీరు, ఎక్కువ సమయం పడుతుంది. వండే ముందు కనీసం అరగంట నానబెడితే సులభంగా ఉడుకుతుంది.

ఖరీదు కాస్త ఎక్కువైనా.. తెల్ల బియ్యం కన్నా బ్రౌన్ రైస్ ఖచ్చితంగా ఆరోగ్యకరమైనదే. అయితే ఆరోగ్యంగా ఉండటానికి కేవలం బ్రౌన్ రైస్ తింటే సరిపోదు, సమతుల్య ఆహారం (పప్పులు, కూరగాయలు) తీసుకోవడం కూడా అంతే ముఖ్యం