రుచిలో పుల్లగా ఉండే స్టార్‌ఫ్రూట్‌ లో ఉన్న ప్రయోజనాలు తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోతారు.

స్టార్‌ ఫ్రూట్‌లో విటమిన్‌ ఎ, బి , సి పుష్కలంగా ఉంటాయి.

స్టార్‌ ఫ్రూట్స్‌లోని విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు.. చర్మాన్ని మెరిసేలా చేస్తాయి.

స్టార్‌ ఫ్రూట్స్‌లోని విటమిన్‌ బి12, జింక్‌.. జుట్టు పెరుగుదలకు దోహదం చేస్తాయి.

ఈ పండులో ఎక్కువ శాతం ఫైబర్‌, తక్కువ కేలరీలు ఉంటాయి. ఫైబర్‌ జీర్ణవ్యవస్థకు మంచిది.

స్టార్‌ఫ్రూట్‌లో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. కేలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ పండుతో బరువు తగ్గవచ్చు.

మలబద్ధకం సమస్యను దూరం చేయడంలో ఇది ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది.

యాంటీ ఆక్సిడెంట్, ఐరన్, జింక్, ఫాస్ఫరస్, మెగ్నీషియం వంటి గుణాలు స్టార్‌ఫ్రూట్‌లో పుష్కలంగా ఉన్నాయి.

ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యలను నయం చేయటంలో సహాయపడుతుంది

కాబట్టి ఈ సీజన్ లో వచ్చే ఈ పండును అసలు మిస్ చేసుకోవద్దు.