నెయ్యి ఎక్కువగా తింటే బరువు పెరుగుతారని అందరూ భావిస్తారు. ఇది ఒక అపోహ మాత్రమే.

ఎన్నో రకాల స్వీట్ల తయారీలో, వంటకాల్లో నెయ్యిని ఉపయోగిస్తారు.

రోజుకు ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్‌ల నెయ్యిని మాత్రమే తీసుకోవాలి.

ఉద‌యం ప‌రగ‌డుపున నెయ్యి తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణ వ్యవస్థ శుభ్రమ‌వుతుంది. మ‌ల‌బ‌ద్దకం స‌మ‌స్య ఉండ‌దు.

కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలోనూ నెయ్యి పనిచేస్తుంది.

రోజువారీ ఆహారంలో నెయ్యిని చేర్చుకోవడం ద్వారా రోజంతా చురుకుగా ఉండొచ్చని చెబుతున్నారు.

నెయ్యిలో యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మంలోని మాయిశ్చరైజర్‌ను కాపాడుతాయి. దీంతో చర్మం ఆరోగ్యం మెరుగుపడుతుంది.

శరీరంలోని హార్మోన్లను బ్యాలెన్స్‌ చేయడంలో నెయ్యి ఎంతగానో ఉపయోగపడుతుంది.

నెయ్యిలో విటమిన్‌ కే పుష్కలంగా లభిస్తుంది. ఇది కాల్షియం శోషణలో సహాయపడుతుంది.

ప్రతి రోజు నెయ్యిని తీసుకోవడం వల్ల శరీరంలోని రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.