కడుపులో గ్యాస్ అజీర్తితో బాధపడుతున్నారా?

కారం, మసాలా అతిగా ఉండే ఆహారాలు తీసుకోవటం సరైన లైఫ్ స్టైల్ నిర్వహించకపోవడం వల్ల కడుపులో గ్యాస్, అజీర్తి వస్తుంది.

అరటి పండులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది కడుపులో గ్యాస్ స్థాయిలను సమతులన చేస్తుంది. ఇది నేచురల్ యాంటిసిన్ కూడా చెప్పవచ్చు.

పరగడుపున ఉదయం అరటిపండు తీసుకోవాలి. ఇది కడుపులో గ్యాస్ సమస్యను తగ్గిస్తుంది.

వాము.. కడుపు సమస్యలతో బాధపడుతున్న వారు వాము తీసుకోవాలి. ఇది గ్యాస్టిక్ సమస్యకు మంచి రెమిడీ అని చెప్పాలి.

వాము ఒక చెంచా తీసుకొని అందులో కాస్త ఒక నల్ల ఉప్పు కూడా కలిపి గోరు వెచ్చని నీళ్లలో వేసుకొని తీసుకోవాలి.

నిమ్మకాయ రసంలో తేనె వేసుకొని ఉదయం పరగడుపున తీసుకోవడం వల్ల జీర్ణ ఆరోగ్యం బాగుంటుంది.

అల్లం ముక్కలుగా కట్ చేసి మరగపెట్టి అందులో కాస్త తేనె వేసుకుని ఉదయం పరగడుపున తీసుకోవడం వల్ల కడుపులో గ్యాస్ తగ్గిపోతుంది.

సోంపు కడుపు సమస్యలను తగ్గిస్తుంది. ఇది గ్యాస్‌ని నివారించే గుణం కలిగి ఉంటుంది.

ఉదయం పరగడుపునొ సోంపుతో టీ తయారు చేసుకొని కూడా తీసుకోవచ్చు.