పరగడపున 2 వెల్లుల్లి రెబ్బలు తింటే ఏమవుతుందో తెలుసా?
రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా తగ్గించేస్తుంది
రోజు మనం వెల్లుల్లి తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ వ్యవస్థలు బలపరుస్తుంది.
ఆర్థరైటిస్, డయాబెటిస్, జాయింట్ పెయిన్ సమస్యలు ఉన్నవాళ్లు వెల్లుల్లి డైట్ లో చేర్చుకోవాలి.
యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. సెల్ డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. దీంతో ఆక్సిడేటీవ్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది.
ఇందులో డైజెస్టివ్ ఎంజైమ్‌లు ఉంటాయి. ఇది ఆరోగ్యకరమైన పేగు కదలికలకు తోడ్పడుతుంది. దీంతో కడుపులో గ్యాస్ ,అజీర్తి తగ్గిపోతుంది.
యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కలిగి ఉంటుంది. చర్మ సమస్యలు, యాక్నేకు వ్యతిరేకంగా పోరాడుతుంది.
వెల్లుల్లి తీసుకోవడం వల్ల మెటబాలిజం రేటు పెరుగుతుంది.
మన గుండె ఆరోగ్యానికి కూడా వెల్లుల్లి మేలు చేస్తుంది.
జలుబు, దగ్గు నుంచి బయటపడతారు. ఇందులో వైరల్ ,ఫంగల్ ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడే గుణం కలిగి ఉంది.