ఎండాకాలంలో చెమట రూపంలో శరీరంలోని నీరంతా బయటకు పోయి త్వరగా అలసిపోతాం. డీహైడ్రేషన్ బారిన పడకుండా, తక్షణ శక్తిని ఇచ్చే 10 అద్భుతమైన వేసవి పండ్లు ఏంటో ఇక్కడ చూద్దాం!

వేసవిలో ప్రకృతి ప్రసాదించిన అమృతం తాటి ముంజలు. ఇవి శరీరంలోని వేడిని క్షణాల్లో తగ్గించి, కడుపులో చల్లదనాన్ని ఇస్తాయి. వడదెబ్బ తగలకుండా కాపాడటంలో ఇవి నంబర్ వన్.

పండ్ల రారాజు మామిడి లేని వేసవిని ఊహించలేం. ఇందులో విటమిన్ ఏ, సి, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి, కంటి చూపును మెరుగుపరుస్తాయి.

పొటాషియం, విటమిన్ ఎ ఎక్కువగా ఉండే కర్బూజ ఎండాకాలంలో బెస్ట్ ఆప్షన్. ఇది శరీరంలోని వాటర్‌ లెవల్స్‌ను బ్యాలెన్స్ చేస్తుంది, అలాగే జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది

ఇందులో 95% నీరే ఉంటుంది. కీరదోసను ముక్కలుగా తినడం వల్ల శరీరంలోని మలినాలు (Toxins) బయటకు పోతాయి. చర్మం కూడా కాంతివంతంగా మారుతుంది.

చెమట ద్వారా కోల్పోయిన ఎలక్ట్రోలైట్స్, విటమిన్-సి లను ఈ సిట్రస్ పండ్లు తిరిగి అందిస్తాయి. ఎండలో తిరిగి వచ్చిన వెంటనే గ్లాసు బత్తాయి జ్యూస్ తాగితే ఎంతో ఫ్రెష్‌గా ఉంటుంది.

జీర్ణక్రియను మెరుగుపరచడంలో బొప్పాయికి సాటి లేదు. ఎండాకాలంలో వచ్చే మలబద్ధకం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలకు ఇది అద్భుతమైన ఔషధం

యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ద్రాక్ష పండ్లు రక్తాన్ని శుద్ధి చేస్తాయి. ఇవి శరీరానికి ఇన్స్టంట్ ఎనర్జీని ఇచ్చి, ఎండ వల్ల వచ్చే నీరసాన్ని తగ్గిస్తాయి.

పైనాపిల్‌లో ఉండే 'బ్రోమెలైన్' (Bromelain) అనే ఎంజైమ్ ఫ్యాట్‌ను కరిగించడంలో సహాయపడుతుంది. జీర్ణవ్యవస్థను క్లీన్ చేసి కడుపులో మంటను తగ్గిస్తుంది.

ముఖ్యంగా షుగర్ వ్యాధి (Diabetes) ఉన్నవారికి వేసవిలో ఇవి వరం లాంటివి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతూ, బాడీని కూల్‌గా ఉంచుతాయి.

సమ్మర్ అనగానే ముందుగా గుర్తొచ్చేది పుచ్చకాయే. ఇందులో ఉండే వాటర్ కంటెంట్, లైకోపీన్ గుండెను ఆరోగ్యంగా ఉంచుతూ శరీరాన్ని డీహైడ్రేషన్ నుంచి రక్షిస్తాయి.

బయట దొరికే ఆర్టిఫిషియల్ డ్రింక్స్ మానేసి.. రోజూ ఈ తాజా పండ్లను మీ డైట్‌లో చేర్చుకోండి. ఈ వేసవిని ఎంతో ఉల్లాసంగా, ఆరోగ్యంగా ఎంజాయ్ చేయండి!