ప్రెగ్నెన్సీ సమయంలో తులసి ఆకులు తినొచ్చా? తింటే ఏమవుతుంది? గర్భిణీలు కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు ఇవే!
ఆయుర్వేదంలో తులసికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి, ఐరన్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గర్భిణీలకు ఎంతో మేలు చేస్తాయి.
ప్రెగ్నెన్సీలో రోగనిరోధక శక్తి (Immunity) తగ్గడం సహజం. తులసిలో ఉండే పవర్ ఫుల్ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు.. గర్భిణీలను జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడతాయి.
గర్భధారణ సమయంలో వచ్చే ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో తులసి అద్భుతంగా పనిచేస్తుంది. ఇది శరీరంలో స్ట్రెస్ హార్మోన్లను బ్యాలెన్స్ చేసి మనసుకు ప్రశాంతతను ఇస్తుంది.
చాలా మంది గర్భిణీలు 'మార్నింగ్ సిక్నెస్' (వికారం, వాంతులు) తో ఇబ్బంది పడతారు. ఉదయాన్నే ఒకటి లేదా రెండు తులసి ఆకులు నమలడం వల్ల ఈ సమస్య నుండి మంచి ఉపశమనం లభిస్తుంది.
తులసి ఆకులలో ఐరన్ కూడా ఉంటుంది. ఇది గర్భిణీలలో రక్తహీనత (Anemia) రాకుండా రక్షిస్తుంది, తల్లితో పాటు కడుపులోని బిడ్డకు అవసరమైన రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.
ఇందులో ఉండే విటమిన్ 'కె' (Vitamin K) కడుపులోని శిశువు ఎముకల ఎదుగుదలకు, బలానికి ఎంతగానో సహాయపడుతుంది.
కానీ జాగ్రత్త! తులసి వల్ల ప్రయోజనాలు ఉన్నప్పటికీ, గర్భిణీలు దీన్ని మోతాదుకు మించి (ఎక్కువగా) అస్సలు తినకూడదు. అతిగా తింటే ప్రమాదం తప్పదు
తులసికి బ్లడ్ షుగర్ లెవెల్స్ ని తగ్గించే గుణం ఉంది. గర్భిణీలు ఎక్కువగా తీసుకుంటే షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పడిపోయి (Hypoglycemia) కళ్లు తిరిగే ప్రమాదం ఉంది.
ఆయుర్వేద నిపుణుల ప్రకారం.. తులసి ఆకులను ఎక్కువగా తినడం వల్ల గర్భాశయ సంకోచాలు (Uterine contractions) మొదలై తీవ్ర పరిణామాలకు దారి తీసే రిస్క్ ఉంది.
తులసిని తీసుకునే సరైన పద్ధతి ఏమిటంటే.. రెండు లేదా మూడు ఆకులను శుభ్రంగా కడిగి తినడం లేదా తేలికపాటి తులసి టీ రూపంలో తీసుకోవడం సురక్షితం.
ప్రతి గర్భిణీ ఆరోగ్యం వేరుగా ఉంటుంది. కాబట్టి తులసిని రోజూ తీసుకునే ముందు కచ్చితంగా మీ డాక్టర్ను సంప్రదించండి!