పాలకూరలో ఆక్సలేట్లు (Oxalates) చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి క్యాల్షియంతో కలిసి కిడ్నీలో రాళ్లుగా మారే ప్రమాదం ఉంది.
టొమాటో గింజలలో ఆక్సలేట్ కంటెంట్ ఉంటుంది. కిడ్నీ సమస్యలు ఉన్నవారు టొమాటోలను
గింజలు తీసేసి
వాడుకోవడం మంచిది.
మటన్, బీఫ్ వంటి రెడ్ మీట్ ఎక్కువగా తినడం వల్ల శరీరంలో
యూరిక్ యాసిడ్
స్థాయిలు పెరుగుతాయి. ఇది కిడ్నీ రాళ్లకు దారితీస్తుంది.
చిప్స్, పచ్చళ్లు, జంక్ ఫుడ్‌లో ఉప్పు (సోడియం) ఎక్కువగా ఉంటుంది. ఇది మూత్రంలో
క్యాల్షియం
శాతాన్ని పెంచి రాళ్లను తయారుచేస్తుంది.
Learn more
సోడాలు, కార్బోనేటెడ్ డ్రింక్స్‌లో ఉండే
ఫాస్ఫారిక్ యాసిడ్
కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రక్రియను వేగవంతం చేస్తుంది.
చాక్లెట్లు, కోకో పౌడర్‌లో కూడా ఆక్సలేట్లు ఎక్కువగా ఉంటాయి. కిడ్నీ రాళ్ల సమస్య ఉన్నవారు వీటికి దూరంగా ఉండటం ఉత్తమం.
బాదం, జీడిపప్పు, పల్లీలు ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ, వీటిలో ఆక్సలేట్లు ఎక్కువ. కాబట్టి వీటిని
పరిమితంగానే
తినాలి.
అతిగా కాఫీ, టీలు తాగడం వల్ల శరీరంలో
డీహైడ్రేషన్ (నీటి శాతం తగ్గడం)
జరుగుతుంది. నీళ్లు తగ్గితే కిడ్నీలో రాళ్లు త్వరగా ఫామ్ అవుతాయి.
చేపలు, రొయ్యలు, పీతలు వంటి సీఫుడ్‌లో
ప్యూరిన్లు (Purines)
ఎక్కువగా ఉంటాయి. ఇవి యూరిక్ యాసిడ్ రాళ్లను ప్రేరేపిస్తాయి.
మిఠాయిలు, బేకరీ ఫుడ్స్, ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీల పనితీరు మందగించి రాళ్లు వచ్చే ఛాన్స్ పెరుగుతుంది.
కిడ్నీలో రాళ్లు రాకుండా ఉండాలంటే రోజుకు కనీసం
3 నుండి 4 లీటర్ల నీరు
తప్పనిసరిగా తాగాలి!
Learn more