మెంతులలో విటమిన్ ఎ, విటమిన్ బి6, విటమిన్ సి, ఐరన్, కాల్షియం, ఫోలిక్ యాసిడ్, పొటాషియం, మెగ్నీషియం, కాపర్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు సమృద్దిగా ఉంటాయి

యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కూడా ఉన్నాయి. ఇది కీళ్ల నొప్పులు మరియు వాపులను తగ్గించడంలో సహాయపడుతుంది.

యూరిక్ యాసిడ్ సమస్య నుండి బయటపడటానికి మెంతులను రాత్రి సమయంలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం నానిన మెంతులను తింటూ ఆ నీటిని తాగాలి.

మెంతి సీడ్ టీని తీసుకోవచ్చు.  పాన్లో ఒక గ్లాసు నీటిని వేడి చేయండి. అందులో ఒక చెంచా మెంతి గింజలను ఉడికించి..ఆ నీటిని వడకట్టి   త్రాగాలి.

యూరిక్ యాసిడ్ నియంత్రణకు  ఉదయం ఖాళీ కడుపుతో ఒక స్పూన్ మొలకెత్తిన మెంతి గింజలను తినాలి .

మెంతి గింజలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ సమస్య తగ్గుతుంది. అయితే, మీకు ఎక్కువ సమస్యలు ఉంటే, డాక్టర్ దగ్గరకు వెళ్ళాలి.