బ్రౌన్ రైస్‌లో ఉండే మెగ్నీషియం, లిగ్నన్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అలాగే చెడు కొలెస్ట్రాల్‌ను కంట్రోల్ చేస్తాయి.
సాధారణ బియ్యం కంటే బ్రౌన్ రైస్ ప్రాసెసింగ్ కాస్త భిన్నంగా ఉంటుంది. దానికి తోడు దీని షెల్ఫ్ లైఫ్ తక్కువ (తొందరగా పాడవుతుంది), అందుకే మార్కెట్లో దీని ధర ఎక్కువగా ఉంటుంది.
మట్టి, నీటి నుండి బియ్యం గ్రహించే 'ఆర్సెనిక్' అనే పదార్థం వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్‌లో కాస్త ఎక్కువ ఉంటుంది. అందుకే వండేముందు దీన్ని బాగా కడగాలి.
పీచు పదార్థం వల్ల కొంతమందికి ఇది త్వరగా అరగదు. కొత్తగా బ్రౌన్ రైస్ తినడం మొదలుపెట్టే వారు, ఒకేసారి కాకుండా కొద్దికొద్దిగా అలవాటు చేసుకోవడం మంచిది.
బ్రౌన్ రైస్ గట్టిగా ఉండటం వల్ల ఉడకడానికి సాధారణం కంటే ఎక్కువ నీరు, ఎక్కువ సమయం పడుతుంది. వండే ముందు కనీసం అరగంట నానబెడితే సులభంగా ఉడుకుతుంది.
ఖరీదు కాస్త ఎక్కువైనా.. తెల్ల బియ్యం కన్నా బ్రౌన్ రైస్ ఖచ్చితంగా ఆరోగ్యకరమైనదే. అయితే ఆరోగ్యంగా ఉండటానికి కేవలం బ్రౌన్ రైస్ తింటే సరిపోదు, సమతుల్య ఆహారం (పప్పులు, కూరగాయలు) తీసుకోవడం కూడా అంతే ముఖ్యం