వేసవి వచ్చేసింది.. పండ్ల రారాజు మామిడి నోరూరిస్తోంది. అయితే డయాబెటిస్ ఉన్నవారు మామిడి పండు తినవచ్చా లేదా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది.

మామిడి పండు చాలా తియ్యగా ఉంటుంది. కాబట్టి, ఇది తింటే రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరుగుతాయని షుగర్ వ్యాధిగ్రస్తులు భయపడుతూ ఉంటారు.

వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. డయాబెటిస్ ఉన్నవారు కూడా ఎలాంటి భయం లేకుండా మామిడి పండును ఆస్వాదించవచ్చు. కానీ, కొన్ని నియమాలు పాటించాలి!

మామిడి పండు గ్లైసెమిక్ ఇండెక్స్ సాధారణంగా 51-56 మధ్య ఉంటుంది. అంటే ఇది 'మధ్యస్థం' (Moderate) కేటగిరీ కిందకు వస్తుంది. కాబట్టి మితంగా తినొచ్చు.

షుగర్ ఉన్నవారు మామిడి పండు తినేటప్పుడు 'పోర్షన్ కంట్రోల్' పాటించాలి. రోజులో కేవలం 2 లేదా 3 ముక్కలు (అర కప్పు) మాత్రమే తినడం సురక్షితం.

– మామిడి పండును ఉదయం లేదా మధ్యాహ్నం స్నాక్ సమయంలో మాత్రమే తినాలి. కడుపు నిండా భోజనం చేసిన వెంటనే స్వీట్ లాగా అస్సలు తినకూడదు. –

మామిడి పండును జ్యూస్ లేదా మ్యాంగో షేక్ రూపంలో ఎట్టిపరిస్థితుల్లోనూ తీసుకోకూడదు. కేవలం పండును ముక్కలుగా కోసుకుని మాత్రమే తినాలి.

జ్యూస్ చేయడం వల్ల పండులోని ఫైబర్ (పీచు పదార్థం) నశించిపోయి, రక్తంలోకి చక్కెర చాలా వేగంగా చేరుతుంది. దీనివల్ల షుగర్ లెవెల్స్ అమాంతం పెరుగుతాయి.

మామిడి ముక్కలను బాదం, వాల్ నట్స్ వంటి డ్రై ఫ్రూట్స్ తో కలిపి తీసుకుంటే.. అందులోని హెల్తీ ఫ్యాట్స్ వల్ల షుగర్ త్వరగా పెరగకుండా కంట్రోల్ అవుతుంది.

బాగా పండిన, అతిగా తీపి ఉన్న పండ్ల (రసాలు) కంటే.. కొంచెం దోరగా ఉన్న, పీచు ఎక్కువగా ఉన్న బంగినపల్లి లాంటి రకాలను ఎంచుకోవడం మేలు.

మీ శరీర తత్వం ఎలా స్పందిస్తుందో తెలుసుకోవడానికి.. మామిడి పండు తిన్న ఒక గంట తర్వాత, మీ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయో గ్లూకోమీటర్ తో చెక్ చేసుకోండి.

ప్రతి ఒక్కరి ఆరోగ్యం ఒకేలా ఉండదు. మీ ప్రస్తుత షుగర్ లెవెల్స్ ఆధారంగా మామిడి పండు ఎన్ని ముక్కలు తినాలో మీ వైద్యుడిని అడిగి తెలుసుకోండి. సమ్మర్ ను ఎంజాయ్ చేయండి!