కరివేపాకుతో బ్లడ్ షుగర్ కంట్రోల్.. ఎలాగో చూడండి!

ప్రతిరోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొన్ని పచ్చి కరివేపాకులను నమలడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు.

కరివేపాకులోని యాంటీఆక్సిడెంట్లు ప్యాంక్రియాటిక్ కణాలను ప్రేరేపించి, శరీరంలో ఇన్సులిన్ సెక్ట్రిషన్‌ను మెరుగుపరుస్తాయి.

ఇవి మనం తినే ఆహారంలోని కార్బోహైడ్రేట్లు చాలా వేగంగా గ్లూకోజ్‌గా మారకుండా అడ్డుకుంటాయి.

కరివేపాకులో పీచుపదార్థం (Fiber) ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను నెమ్మదింపజేసి, షుగర్ లెవల్స్ అకస్మాత్తుగా పెరగకుండా (Spikes) చూస్తుంది.

డయాబెటిస్ ఉన్నవారికి గుండె జబ్బుల ముప్పు ఎక్కువ. కరివేపాకు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండెను కాపాడుతుంది.

ఇందులో ఉండే 'మహానింబిన్' అనే సమ్మేళనం బరువు పెరగకుండా నిరోధిస్తుంది, తద్వారా టైప్-2 డయాబెటిస్ రిస్క్ తగ్గుతుంది.

డయాబెటిస్ మందులు లేదా ఇన్సులిన్ వాడుతున్న వారు అతిగా కరివేపాకు తింటే, షుగర్ లెవల్స్ మరీ పడిపోయే (Hypoglycemia) ప్రమాదం ఉంది.

కొందరికి కరివేపాకు అతిగా తింటే కడుపునొప్పి, గ్యాస్ లేదా అలర్జీలు వచ్చే అవకాశం ఉంది. పరిమితిగా (రోజుకు 5-8 ఆకులు) తినడం మంచిది.

మార్కెట్ నుండి తెచ్చే ఆకులపై పురుగుమందులు ఉండే అవకాశం ఉంది. కాబట్టి నమలడానికి ముందు ఉప్పు నీటితో బాగా కడగాలి.

కరివేపాకు కేవలం మద్దతుగా మాత్రమే పనిచేస్తుంది, ఇది మందులకు ప్రత్యామ్నాయం కాదు. మీ డైట్‌లో మార్పులు చేసే ముందు డాక్టర్‌ను సంప్రదించడం ఉత్తమం.