ఓట్స్ బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ ఆప్షన్. ఇందులో ఉండే 'బీటా-గ్లూకాన్' అనే ఫైబర్ రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ మరియు షుగర్ లెవెల్స్‌ను నియంత్రిస్తుంది.
చియా సీడ్స్ ఒక సూపర్ ఫుడ్. వీటిలో ఫైబర్ అత్యధికంగా ఉంటుంది. రోజూ నీటిలో లేదా మజ్జిగలో నానబెట్టి తాగడం వల్ల జీర్ణక్రియ అద్భుతంగా మెరుగుపడుతుంది.
పండ్లలో జామకాయ ఫైబర్‌కు కేరాఫ్ అడ్రస్. రోజూ ఒక జామకాయ తింటే మలబద్ధకం సమస్య ఇట్టే మాయం అవుతుంది. షుగర్ పేషెంట్లకు కూడా ఇది చాలా మంచిది.
కందిపప్పు, పెసరపప్పు, శనగలు వంటి పప్పు ధాన్యాల్లో ప్రోటీన్‌తో పాటు ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. ఇవి రోజంతా కడుపు నిండిన భావనను ఇచ్చి బరువు తగ్గడంలో సాయపడతాయి.
రోజుకో యాపిల్ డాక్టర్‌ను దూరం చేస్తుంది.. అలాగే జీర్ణ సమస్యలను కూడా! యాపిల్‌ను తొక్కతో సహా తినడం వల్ల శరీరానికి అవసరమైన పీచు పదార్థం దొరుకుతుంది.
ఆకలి వేసినప్పుడు స్నాక్స్ రూపంలో తినడానికి బాదం బెస్ట్ ఛాయిస్. ఇందులో ఫైబర్‌తో పాటు ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి గుండెకు మేలు చేస్తాయి.
సాధారణ బంగాళదుంప కంటే చిలగడదుంపలో ఫైబర్ రెట్టింపు ఉంటుంది. ఇది శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడమే కాకుండా పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది
కూరల్లో లేదా ఉడకబెట్టుకుని తినే పచ్చి బఠానీలలో ఫైబర్, ఐరన్ మరియు విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
క్యారెట్ అనగానే కంటి చూపు గుర్తుకొస్తుంది, కానీ ఇందులో ఫైబర్ కూడా ఎక్కువే. ఇది జీర్ణవ్యవస్థను శుభ్రపరచడంలో, గ్యాస్ సమస్యలను నివారించడంలో పనిచేస్తుంది.
వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్ వాడటం ఆరోగ్యానికి చాలా ముఖ్యం. తొక్క తీయని ఈ బియ్యంలో ఉండే ఫైబర్.. తిన్న వెంటనే బ్లడ్ షుగర్ లెవెల్స్ అమాంతం పెరగకుండా చూస్తుంది.