డీమార్ట్‌లో రూ. 3,000 ఆదా చేయాలా? ఈ 12 టిప్స్ మీకోసమే!
డీమార్ట్‌కు వెళ్లే ముందే ఇంట్లో ఏ వస్తువులు అవసరమో లిస్ట్ రాసుకోండి. దీనివల్ల అనవసరమైన వస్తువులు కొని డబ్బు వృథా చేయకుండా ఉంటారు.
సబ్బులు, పప్పులు, క్లీనింగ్ లిక్విడ్స్ వంటి వస్తువుల విషయంలో డీమార్ట్ సొంత బ్రాండ్లను ఎంచుకోండి. ఇవి ఇతర బ్రాండ్ల కంటే 20-30% తక్కువ ధరకు లభిస్తాయి.
సాధారణంగా ఖరీదైన వస్తువులు మన కంటికి కనిపించే ఎత్తులో ఉంటాయి. తక్కువ ధర కలిగిన వస్తువులను కింద ఉన్న షెల్ఫ్స్‌లో ఉంచుతారు. అక్కడ వెతకడం మర్చిపోవద్దు
నెలకు సరిపడా సరుకులు కొనేటప్పుడు పెద్ద ప్యాకెట్లు (Bulk packs) ఎంచుకోండి. చిన్న ప్యాకెట్ల కంటే వీటిపై డిస్కౌంట్ ఎక్కువగా ఉంటుంది
Learn more
బిస్కెట్లు, స్నాక్స్, మరియు హోమ్ కేర్ వస్తువులపై ఉండే BOGO (Buy One Get One) ఆఫర్లను ఉపయోగించుకోండి. దీనివల్ల నేరుగా 50% ఆదా అవుతుంది.
డీమార్ట్‌లో కంటైనర్లు, బాటిల్స్, మరియు స్టీల్ సామాగ్రిపై డీల్స్ చాలా బాగుంటాయి. వీటిని పండుగ సీజన్లలో కాకుండా సాధారణ రోజుల్లో కొంటే మరింత లాభం
ఏ వస్తువు పైన అయినా MRP కంటే కనీసం 5% నుండి 10% తక్కువ ధరకే డీమార్ట్ విక్రయిస్తుంది. షెల్ఫ్ పైన ఉన్న 'D-Mart Price'ను గమనించండి.
వినడానికి వింతగా ఉన్నా, ఇది నిజం. పిల్లలు వెంట ఉంటే చాక్లెట్లు, బొమ్మలు వంటివి అడుగుతుంటారు. దీనివల్ల మీ బడ్జెట్ అదుపు తప్పుతుంది.
బిల్లింగ్ దగ్గర ఉండే చాక్లెట్లు, చిన్న చిన్న వస్తువులను చూసి ఆకర్షితులు కావద్దు. ఇవి మీ బిల్లును పెంచడానికి చేసే మార్కెటింగ్ ట్రిక్స్.
బిల్ చెల్లించేటప్పుడు నిర్దిష్ట బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డులు వాడితే అదనంగా 5% వరకు క్యాష్‌బ్యాక్ పొందే అవకాశం ఉంటుంది.
డీమార్ట్‌లో దుస్తులు మరియు చెప్పులు చాలా తక్కువ ధరకే లభిస్తాయి. రోజువారీ వాడకానికి (Daily wear) ఇవి బెస్ట్ ఆప్షన్
మీకు సమయం లేకపోతే 'D-Mart Ready' యాప్ ద్వారా ఆర్డర్ చేసి పిక్-అప్ పాయింట్ వద్ద తీసుకోవచ్చు. దీనివల్ల పెట్రోల్ ఖర్చు మరియు సమయం ఆదా అవుతుంది.
Learn more