ప్రెగ్నెన్సీ సమయంలో బొప్పాయి తినొచ్చా? అసలు గర్భిణీలు బొప్పాయి తింటే అబార్షన్ అవుతుందా? నిజాలు తెలుసుకుందాం!
ముందుగా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం.. గర్భధారణ సమయంలో పచ్చి లేదా సగం పండిన బొప్పాయి (Unripe Papaya) తినడం చాలా ప్రమాదకరం. దీనికి అస్సలు తినకూడదు.
ఎందుకంటే.. పచ్చి బొప్పాయిలో ఉండే 'లాటెక్స్', 'పాపైన్' అనే ఎంజైమ్స్ గర్భాశయ సంకోచాలకు (Uterine contractions) కారణమై అబార్షన్‌కు దారి తీసే ప్రమాదం ఉంది.
కానీ గుడ్ న్యూస్ ఏమిటంటే.. పూర్తిగా పండిన (Fully Ripe) బొప్పాయి పండును మితంగా తినడం గర్భిణీలకు సురక్షితమే కాకుండా ఎన్నో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది.
బాగా పండిన బొప్పాయిలో విటమిన్ ఎ, విటమిన్ సి, మరియు విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి. ఇవి తల్లి, బిడ్డల రోగనిరోధక శక్తిని (Immunity) అమాంతం పెంచుతాయి.
ప్రెగ్నెన్సీలో వేధించే ప్రధాన సమస్య మలబద్ధకం (Constipation). బొప్పాయి పండులోని ఫైబర్ (పీచుపదార్థం) జీర్ణవ్యవస్థను మెరుగుపరిచి ఈ సమస్యను సులభంగా దూరం చేస్తుంది.