మార్కెట్ నుంచి తెచ్చిన కొత్తిమీర రెండు, మూడు రోజులకే వాడిపోతోందా? నల్లగా మారిపోతోందా? అయితే ఈ చిట్కాలు మీకోసమే.
కొత్తిమీర కట్టను విప్పి, అందులో ఉన్న పసుపు రంగు ఆకులు, కుళ్లిపోయిన కాడలు, గడ్డి ఉంటే ముందుగా వేరు చేసి పడేయండి.
కొత్తిమీరను ఎక్కువ రోజులు నిల్వ చేయాలనుకుంటే, అడుగున ఉన్న వేర్లను కత్తిరించి కేవలం కాడలు, ఆకులను మాత్రమే తీసుకోవాలి.
కత్తిరించిన కొత్తిమీరను ఒక పెద్ద గిన్నెలో నీరు తీసుకుని రెండు మూడు సార్లు బాగా కడగండి. మట్టి అస్సలు ఉండకూడదు.
కడిగిన కొత్తిమీరను ఒక కాటన్ వస్త్రం లేదా పేపర్ టవల్ మీద ఆరబోయండి. ఫ్యాన్ గాలికి కనీసం గంటపాటు పూర్తిగా ఆరనివ్వాలి.
Learn more
కొత్తిమీర నిల్వ చేయడానికి ప్లాస్టిక్ లేదా గాజుతో చేసిన ఎయిర్ టైట్ (గాలి చొరబడని) కంటైనర్ తీసుకోండి.
ఆ డబ్బా అడుగు భాగంలో ఒక పేపర్ టవల్ లేదా రెండు టిష్యూ పేపర్లను పరచండి. ఇది అదనపు తేమను పీల్చుకుంటుంది.
తడి పూర్తిగా ఆరిపోయిన కొత్తిమీరను డబ్బాలో ఉంచండి. మరీ ఒత్తిపెట్టకుండా, కాస్త ఖాళీ ఉండేలా వదులుగా వేయాలి.
కొత్తిమీర పైన మరో టిష్యూ పేపర్‌ను కప్పి ఉంచండి. ఇప్పుడు డబ్బా మూతను గట్టిగా మూసేసి ఫ్రిజ్‌లో పెట్టుకోండి.
డబ్బా లేకపోతే, పూర్తిగా ఆరిన కొత్తిమీరను టిష్యూ పేపర్‌లో చుట్టి జిప్ లాక్ (Zip-lock) కవర్‌లో వేసి, గాలి తీసేసి కూడా ఫ్రిజ్‌లో పెట్టుకోవచ్చు.
వారం రోజుల తర్వాత డబ్బా తెరిచి చూడండి. టిష్యూ పేపర్ మరీ తడిగా అనిపిస్తే, దాని స్థానంలో కొత్త పేపర్ మార్చండి.
ఇలా జాగ్రత్తలు పాటిస్తే.. కొత్తిమీర కనీసం 15 నుంచి 20 రోజుల పాటు రంగు, వాసన కోల్పోకుండా పచ్చగా, తాజాగా ఉంటుంది.
Learn more