Oats:ఓట్స్ మంచివే.. కానీ ఈ సమస్యలు ఉన్న వారు తింటే..
ఆరోగ్య కరమైన ఓట్స్ కూడా కొంతమందికి హానికరం అని మీరు ఎప్పుడైనా అనుకున్నారా..?
ఓట్స్ తినడం కొన్ని శారీరక సమస్యలు ఉన్నవారికి అనారోగ్యకరమైనదిగా నిపుణులు చెబుతున్నారు.
జీర్ణ సమస్యలు ఎక్కువగా ఉన్నవారు ఓట్స్ ను తినకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
అలెర్జీ సమస్యలు ఉన్నవారు కూడా ఓట్స్ తినకుండా ఉండాలి.
మీకు డయాబెటిస్ ఉన్నప్పటికీ మీరు ఓట్స్‌ను తక్కువ పరిమాణంలో తీసుకోవాలి. ఎక్కువగా తినటం వల్ల డయాబెటిస్ ఉంటే రక్తంలో చక్కెర స్థాయి వేగంగా పెరుగుతుంది.
ఓట్స్‌లో ఫైటిక్ యాసిడ్ ఉంటుంది. ఇది యాంటీ న్యూట్రియంట్. ఇది ముఖ్యమైన ఖనిజాలతో బంధించి, శరీరంలో వాటి శోషణను తగ్గిస్తుంది
ఖనిజాల లోపం ఉన్నవారు, ఓట్స్ ఎక్కువగా తీసుకునేవారు తక్కువ పరిమాణంలో తినమని నిపుణులు సూచిస్తున్నారు.
ఓట్స్‌లో ఉండే ప్రోటీన్ అవెనిన్‌కు రోగనిరోధక వ్యవస్థ ప్రతిస్పందించడం వల్ల ఈ అలెర్జీ వస్తుంది.
బలహీనమైన జీర్ణవ్యవస్థ ఉన్నవారు ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఓట్స్ ను తినకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు