ఎండ వేడిని తగ్గించి చల్లదనాన్ని అందించే 5 పండ్లు..
ఎండ తీవ్రత పెరిగిపోతుంది. రాను రాను ఉక్కపోత కూడా మొదలయ్యింది. ఈ నేపథ్యంలో మనం తీసుకునే ఆహారంపై జాగ్రత్తలు తీసుకోవాలి.
కీర దోసకాయ మనందరికీ తెలిసిందే. ఇందులో 95% కంటే నీరు అధికంగా ఉంటుంది. ఇది ఎండాకాలంలో మార్కెట్లో కూడా విరివిగా అమ్ముతారు.
హైడ్రేషన్ నిలుపుతుంది. అంతేకాదు మన శరీరంలో నుంచి విష పదార్థాలను కూడా కీరదోసకాయ బయటకు పంపుతుంది.
ఈవినింగ్ స్నాక్స్ కూడా తీసుకోవచ్చు. ఇది జ్యూస్ రూపంలో కూడా తయారు చేసుకుంటారు.
ఇందులో విటమిన్ ఏ, విటమిన్ సి కూడా ఉంటుంది. పుచ్చకాయ మంచి హైడ్రేషన్ ఇస్తుంది.
ఇది హానికరమైన సూర్యకిరణాల నుంచి మన శరీరాన్ని కూడా కాపాడుతుంది. వడదెబ్బకు గురికాకుండా ఉండాలంటే పుచ్చకాయ తీసుకోవాలి.
పెరుగులో ఉండే ప్రోబయోటిక్ వల్ల మనకు ఎండ దెబ్బకు గురి కాకుండా ఉంటాము. ఇది జీర్ణ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.
కొబ్బరి నీరులో ఔషధ గుణాలు పుష్కలం. ఇది నేచురల్ ఎలక్ట్రోలైట్ మనకు తక్షణ శక్తి కూడా అందిస్తుంది.
ఎండాకాలంలో సీట్రస్ పండ్లు ప్రతిరోజు తీసుకోవాలి. తద్వారా మన శరీరం చల్లగా ఉంటుంది.