రోజూ గుప్పెడు పల్లీలు తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ (LDL) తగ్గి, మంచి కొలెస్ట్రాల్ (HDL) పెరుగుతుంది. ఇది ప్రాణాంతక గుండెపోటు ప్రమాదాన్ని చాలా వరకు తగ్గిస్తుంది.
పల్లీలలో గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. వీటిని డైలీ డైట్లో చేర్చుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి మరియు టైప్-2 మధుమేహం రాకుండా కాపాడుతుంది.
పల్లీలలో 'ఫైటోస్టెరాల్స్' మరియు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుని, ముఖ్యంగా కొలొరెక్టల్ క్యాన్సర్ ముప్పును తగ్గిస్తాయి.
పల్లీలలో ఉండే విటమిన్ బి3 (నియాసిన్) మరియు రెస్వెరాట్రాల్ అనే సమ్మేళనం మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. ఇది వృద్ధాప్యంలో వచ్చే 'అల్జీమర్స్' (మతిమరుపు) వ్యాధిని దరిచేరనివ్వదు.
పల్లీలలో ఐరన్ మరియు ఫోలేట్ సమృద్ధిగా ఉంటాయి. రోజూ వీటిని బెల్లంతో కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో రక్తం (హిమోగ్లోబిన్) వేగంగా పెరిగి, ఎనీమియా సమస్య తొలగిపోతుంది.
పల్లీలలో ప్రోటీన్ మరియు ఫైబర్ కంటెంట్ ఎక్కువ. గుప్పెడు పల్లీలు తింటే కడుపు నిండినట్లు అనిపించి, ఎక్కువసేపు ఆకలి వేయదు. ఇది జంక్ ఫుడ్ తినకుండా బరువు తగ్గడానికి హెల్ప్ చేస్తుంది.
ఇందులో 'ట్రిప్టోఫాన్' అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది మెదడులో సెరటోనిన్ (హ్యాపీ హార్మోన్) విడుదలకు సహాయపడుతుంది. ఫలితంగా ఒత్తిడి, ఆందోళన మరియు డిప్రెషన్ తగ్గుతాయి.
పల్లీలలో ఉండే కాల్షియం, మెగ్నీషియం మరియు ఫాస్పరస్ ఎముకలను, పళ్ళను దృఢంగా మారుస్తాయి. వయసు పెరిగే కొద్దీ వచ్చే కీళ్ల నొప్పులను ఇవి నివారిస్తాయి.
పల్లీలలోని విటమిన్ ఇ మరియు యాంటీఆక్సిడెంట్లు చర్మ కణాలను రక్షిస్తాయి. ఇవి ముఖంపై ముడతలను తగ్గించి, చర్మం ఎల్లప్పుడూ కాంతివంతంగా, యవ్వనంగా మెరిసేలా చేస్తాయి.
అధిక పోషకాలున్న పల్లీలను రోజూ గుప్పెడు (సుమారు 30 గ్రాములు) నానబెట్టి లేదా వేయించి తింటే.. ఎలాంటి ప్రాణాంతక వ్యాధులైనా మీ దరిచేరవు.