పైసా ఖర్చు లేకుండా గ్లోయింగ్ స్కిన్ కోసం 10 కిచెన్ టిప్స్

పసుపులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలం. పాలలో కొద్దిగా పసుపు కలిపి ముఖానికి రాస్తే చర్మానికి సహజమైన కాంతి వస్తుంది.

ఇది బెస్ట్ న్యాచురల్ ఫేస్ ప్యాక్. చర్మంపై ఉన్న మృతకణాలను (Dead cells) తొలగించి, ముఖాన్ని తక్షణమే మృదువుగా, తాజాగా మారుస్తుంది.

నిమ్మరసం నాచురల్ బ్లీచ్‌లా పనిచేస్తే, తేనె చర్మానికి అద్భుతమైన తేమను అందిస్తుంది. ఈ మిశ్రమం డార్క్ స్పాట్స్‌ను తగ్గిస్తుంది.

టొమాటోలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మంపై ఉన్న ట్యాన్ (Tan)ను వేగంగా తొలగించి, ముఖంపై ఉన్న చర్మ రంధ్రాలను (Pores) శుభ్రపరుస్తాయి

స్వచ్ఛమైన కలబంద గుజ్జును రోజూ ముఖానికి రాసుకుంటే మొటిమలు, మచ్చలు తగ్గిపోయి చర్మం యవ్వనంగా, కాంతివంతంగా మారుతుంది.

కళ్ళ కింద ఉండే నల్లటి వలయాలు (Dark circles), ముఖంపై నల్లటి మచ్చలను మాయం చేయడంలో బంగాళదుంప రసం మ్యాజిక్‌లా పనిచేస్తుంది.

కాఫీ పొడిలో కొద్దిగా కొబ్బరి నూనె కలిపి స్క్రబ్‌లా వాడితే.. ముఖంపై రక్త ప్రసరణ మెరుగుపడి ఇన్‌స్టంట్ గ్లో (Instant Glow) వస్తుంది.

దోసకాయ రసం చర్మాన్ని లోపలి నుంచి చల్లబరుస్తుంది. ఎండకు కమిలిన చర్మానికి తిరిగి జీవం పోయడానికి ఇది బెస్ట్ కూలింగ్ ట్రీట్‌మెంట్.

పంచదారలో కొద్దిగా ఆలివ్ ఆయిల్ లేదా నిమ్మరసం కలిపి ముఖం, పెదవులపై సున్నితంగా రుద్దితే డెడ్ స్కిన్ సులువుగా తొలగిపోతుంది.

రోజువారీ పనుల తర్వాత పడుకునే ముందు ముఖాన్ని రోజ్ వాటర్‌తో శుభ్రం చేసుకుంటే చర్మం ఫ్రెష్‌గా ఉండి, ఉదయానికి గ్లోయింగ్‌గా కనిపిస్తుంది.