ఎండాకాలంలో చెరుకు రసం తాగుతున్నారా? ఈ 12 విషయాలు మర్చిపోవద్దు!
ఎండ దెబ్బకు నీరసించిపోయారా? ఒక గ్లాసు చెరుకు రసం తాగితే చాలు. ఇందులో ఉండే గ్లూకోజ్ శరీరానికి తక్షణ శక్తిని అందించి, మిమ్మల్ని హుషారుగా మారుస్తుంది.
వేసవిలో శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉండాలంటే చెరుకు రసం ఉత్తమ ఎంపిక. ఇది శరీరంలోని ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుతుంది.
చెరుకు రసం సహజంగా డయూరిటిక్ (Diuretic) లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది మూత్రపిండాల్లోని రాళ్లను తొలగించడానికి మరియు యూరినరీ ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి సహాయపడుతుంది.
ఆయుర్వేదం ప్రకారం, చెరుకు రసం కాలేయానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా కామెర్లు (Jaundice) వచ్చినప్పుడు కాలేయం త్వరగా కోలుకోవడానికి ఇది తోడ్పడుతుంది.
కడుపులో మంటగా ఉందా? చెరుకు రసంలోని పొటాషియం జీర్ణవ్యవస్థను క్రమబద్ధీకరిస్తుంది. ఇది మలబద్ధకం సమస్యను కూడా తగ్గిస్తుంది.