యూరిక్ యాసిడ్ తగ్గించే 10 అద్భుతమైన నేచురల్ డ్రింక్స్

రోజూ కనీసం 3-4 లీటర్ల నీరు తాగడం వల్ల శరీరంలోని అదనపు యూరిక్ యాసిడ్ మూత్రం ద్వారా సులభంగా బయటకు వెళ్లిపోతుంది.

ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగితే.. అందులోని సిట్రిక్ యాసిడ్ యూరిక్ యాసిడ్ స్థాయిలను సమర్థవంతంగా తగ్గిస్తుంది.

చెర్రీస్‌లో ఉండే యాంతోసైనిన్లు కీళ్ల నొప్పులను తగ్గించడమే కాకుండా, యూరిక్ యాసిడ్‌ను అదుపులో ఉంచుతాయి.

ఒక గ్లాసు నీటిలో ఒక స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ కలిపి తాగడం వల్ల శరీరంలో ఆల్కలీన్ గుణాలు పెరిగి, టాక్సిన్స్ తొలగిపోతాయి.

యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే గ్రీన్ టీని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ ఉత్పత్తి తగ్గుతుంది.

కీరాలో నీటి శాతం ఎక్కువ. ఇది కిడ్నీలను ఫిల్టర్ చేసి, యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ కరిగిపోయేలా చేస్తుంది.

సహజసిద్ధమైన కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరం హైడ్రేట్‌గా ఉండటమే కాకుండా, యూరిక్ యాసిడ్ స్థాయిలు వేగంగా తగ్గుతాయి.

అల్లంలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు యూరిక్ యాసిడ్ వల్ల వచ్చే కీళ్ల వాపులు, నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తాయి.

విటమిన్-సి పుష్కలంగా ఉండే ఉసిరి రసాన్ని డైట్‌లో చేర్చుకోవడం వల్ల టాక్సిన్స్ తొలగిపోయి యూరిక్ యాసిడ్ అదుపులోకి వస్తుంది.

సెలెరీ ఆకుల రసం సహజ మూత్రవిసర్జనకారిగా (Diuretic) పనిచేసి, యూరిక్ యాసిడ్‌ను శరీరం నుండి త్వరగా బయటకు పంపుతుంది.

ఈ చిట్కాలు సాధారణ సమాచారం కోసం మాత్రమే. సమస్య తీవ్రంగా ఉంటే ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి.