పెరుగును ప్రతి రోజు తింటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు 

పెరుగులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇందులో విటమిన్ డి కూడా ఉంటుంది, ఇది మన శరీరం కాల్షియంను గ్రహించడంలో సహాయపడుతుంది.

పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ మన రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. ఇది మన పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

పెరుగులో ఉండే మేలు చేసే బ్యాక్టీరియా మన చర్మాన్ని తేమగా ఉంచుతుంది. ఇందులో ఉండే లాక్టిక్ యాసిడ్ మన చర్మంపై దురద రాకుండా చేస్తుంది. చర్మాన్ని మృదువుగా, మెరిసేలా చేస్తుంది.

పెరుగులోని మంచి బ్యాక్టీరియా యోనిలో pH స్థాయిని సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది. ఇది యోనిలో ఫంగల్ ఇన్ఫెక్షన్‌ను కూడా నివారిస్తుంది.

లాక్టోస్ పడని, అలెర్జీ ఉండే వ్యక్తులు పెరుగు తినకూడదనే అభిప్రాయం ఉంది.  కానీ పెరుగులో ఉండే మేలు చేసే బ్యాక్టీరియా లాక్టోస్‌ను విచ్ఛిన్నం చేస్తుంది. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా తినవచ్చు.