ఈ యాడ్ లో నటించిన ఈ పాప ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?
ఈ నగరానికి ఏమైంది అనే డైలాగ్ సినిమాలు చూసే ప్రతి ప్రేక్షకుడికి పరిచయమే. ఎందుకంటే మనం సినిమా చూడటానికి ఏ ధియేటర్ కి వెళ్లిన మొదట వచ్చే యాడ్ అదే. ఈ పాప ధూమపానానికి తప్పదు భారీ మూల్యం…అనే యాడ్ లో కన్పిస్తుంది. ఇప్పుడు ఈ పాప ఏమి చేస్తుందో తెలుసా? ఈ పాప పేరు సిమ్రన్ నటేకర్. ఈమె ఇప్పటికే అనేక హిందీ సీరియల్స్ లో నటించింది. ఈ పాప హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వటానికి సిద్ధం అయినట్టు సమాచారం. చిన్నారి పెళ్లి కూతురులో పూజ పాత్రలో నటించింది.క్రిష్-3 వంటి భారీ సినిమాల్లో కూడా నటించింది. ఇప్పుడు తెలుగులో ఎంట్రీ ఇవ్వటానికి సిద్ధం అవుతుంది. లోబడ్జెట్ సినిమాలతో కోట్లు కొల్లగొట్టిన ఓ టాప్ బ్యానర్ సిమ్రన్ నటేకర్ ని తెలుగులో నటింపచేయటానికి సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాకి అవసరాల శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తాడని వార్తలు వస్తున్నాయి.