MoviesTollywood news in telugu

Childhood Pic:ఈ చిచ్చరపిడుగుని గుర్తు పట్టారా …. ఇప్పుడు ఏమి చేస్తున్నాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు

Childhood Pic:చాలా మంది చైల్డ్ ఆర్టిస్టుల్లో కొందరు పెద్దయ్యాక కూడా ఇండస్ట్రీనే తమకు బాసటగా ఎంచుకుంటారు. కొందరు వేరే వృత్తుల్లో స్థిరపడతారు. అయితే ఒకప్పుడు బాలనటుడిగా నవ్వుతు ఛాన్స్ లు కొట్టేసి, అగ్ర హీరోలు సైతం ఆశ్చర్యంలో ముంచెత్తిన ఆనంద్ వర్ధన్ గుర్తున్నాడా?

అదేనండీ తూనీగా తూనీగా పాటలో ఒదిగిపోయిన బాల నటుడు. ఇంకా కొంచెం ముందుకెళ్తే ఎంతో కష్టమైన సంస్కృత శ్లోకాలను అలవోకగా కంఠస్థం చేసి అప్పగించిన ఆనంద్ వర్ధన్ బాల రామాయణంలో వాల్మీకి పాత్రతో అప్పట్లోనే తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. 90వ దశకంలో పిట్ట కొంచెం కూతఘనం అన్నచందంగా తన అమోఘమైన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు.

ప్రియ రాగాలు చిత్రంలో ఆనంద్ వర్ధన్ నటించి ప్రేక్షకుల మదిలో నిలిచాడు. జగపతి బాబు, సౌందర్య పక్కన బాలనటుడిగా నటించి, ఏకంగా నంది అవార్డు కూడా అందుకున్నాడు. ఆనంద్ వర్ధన్ సినీ మూలాలు ఉన్నవాడే. ఎందుకంటే అతని తాత గారు ప్రఖ్యాత నేపధ్య గాయకుడు పిబి శ్రీనివాస్.

అతని తండ్రి హైదరాబాద్ లో చార్టెడ్ ఎక్కౌంటెంట్ గా పనిచేస్తున్నారు. తల్లి మామూలుగా గృహిణి. ఆనంద్ వర్ధన్ కి ఓ సోదరుడు కూడా ఉంన్నాడు. ఇక సినీ నేపధ్యం ఉండడంతో ఇంట్లో సినిమాలు గురించి జోరుగానే చర్చ జరిగేదట. దానికి తోడు ఆనంద్ వర్ధన్ కి కూడా మొదటి నుంచీ సినిమా పిచ్చే.

అయితే సినిమా అంటే ఏమిటో తెలియని మూడున్నరేళ్ల వయస్సులో సంస్కృత శ్లోకాలు నేర్చుకుని అవలీలగా వల్లెవేసేవాడు ఆనంద్ వర్ధన్. తాతగారి దగ్గర అన్నీ నేర్చుకుని, అందరినీ ఆకట్టుకుంటున్న ఇతని గురించి అన్ని పేపర్స్ లో కూడా వచ్చింది. ఇలా న్యూస్ పేపర్ ద్వారా తెల్సుకున్న దర్శకుడు గుణశేఖర్, తాను డైరెక్ట్ చేసే బాల రామాయణంలో వాల్మీకి పాత్రకు ఎంపిక చేసాడు.

ప్రియరాగాలు, ప్రేమించుకుందాం రా, మనసంతా నువ్వే, సూర్యవంశం వంటి చిత్రాల్లో నటించి మెప్పించాడు. అంతేకాదు సూర్యవంశం హిందీ వెర్షన్ లో సైతం నటించి హిందీ సూపర్ స్టార్ అమితాబ్ దగ్గర మార్కులు కొట్టేసాడు. ఇక బాలనటుడిగా సినిమాలకు గుడ్ బై చెప్పేసి, ఇంజనీరింగ్ చదివే సమయంలో తోటి స్నేహితులు ఇతన్ని తూనీగా, తూనీగా అని పిలిచేవారట.

అయితే ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్న ఆనంద్ వర్ధన్ అందుకు తగ్గట్టు ఫిజిక్ తయారు చేసుకుంటున్నాడు. మార్షల్ ఆర్ట్స్, డాన్సులు, జిమ్నా స్టిక్స్ లలో తర్ఫీదు తీసుకుంటున్నాడు. తన బాడీ లాంగ్వేజ్ కి తగ్గ హీరో రోల్ ఎంచుకుని త్వరలోనే టాలీవుడ్ హీరోగా రావాలనుకుంటున్న ఆనంద్ వర్ధన్ సక్సెస్ ఫుల్ హీరోగా రాణిస్తాడని ఆశిద్దాం.

ఆనంద్ వర్ధన్ హీరోగా సినిమా చేస్తున్నాడు. త్వరలో అభిమానుల ముందుకు వస్తుంది. మంచి పాత్రలతో హీరోగా సక్సెస్ సాధించాలని కోరుకుందాం.