MoviesTollywood news in telugu

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీ ఇప్పుడేం చేస్తోంది?

రామ్ చరణ్ టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన సినిమా ‘చిరుత’ అందరికి గుర్తుండే ఉంటుంది. ఆ సినిమాలో డబ్బున్న పొగరు అమ్మాయిగా నటించిన నేహాశర్మ గుర్తు ఉందా? ఆమె తండ్రి ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏమిటో తెలుసా? ఇప్పుడు ఆ వివరాలను తెలుసుకుందాం. చిరుత సినిమా తర్వాత నేహా శర్మ  కొన్ని సినిమాలు చేసిన పెద్దగా సక్సెస్ కాలేదు. తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి బాలీవుడ్ కి కూడా వెళ్ళింది. అయితే అక్కడ కూడా నిరాశే ఎదురు అయింది. నేహా శర్మ తండ్రి మంచి పొజిషన్ లో ఉన్నా సరే తండ్రి సహకారం తీసుకోకుండా సక్సెస్ కావాలని ప్రయత్నం చేసింది. నేహా శర్మ తండ్రి అజీత్ శర్మ పెద్ద పారిశ్రామిక వేత్త. అలాగే బీహార్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయనకు కొన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి. నేహా శర్మ తండ్రి పేరు చెప్పుకొని అవకాశాల కోసం ప్రయత్నం చేయలేదు. గత ఎన్నికల్లో నేహా శర్మ తండ్రి కోసం ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొంది. నేహా శర్మకు ఇద్దరు చెల్లెల్లు ఉన్నారు. నేహా శర్మ చెల్లి అయేషా శర్మ కూడా బాలీవుడ్ లో నిలదొక్కుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది.

ఈ సంవత్సరం నేహా శర్మ ముబారకాన్ సినిమా ద్వారా బాలీవుడ్ లో హిట్ కొట్టింది. తెలుగులో చిరుత సినిమా తర్వాత కుర్రాడు సినిమాలో మాత్రమే నటించింది. ప్రస్తుతం ఆమె దృష్టి అంతా బాలీవుడ్ మీదే ఉంది. 

అటు సినిమాలతోపాటు.. ఓటీటీల కోసం రెండు వెబ్ సీరిస్‌ల్లో కూడా నటించింది. ‘ఇల్లీగల్’, ‘షైనింగ్ విత్ శర్మస్’ వెబ్ సీరిస్‌ల్లో నటించింది. నేహా శర్మ ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌ ఇన్‌ఫ్లుయేన్సర్‌గా రాణిస్తోంది.

ఇప్పటికే ఆమెకు 21 మిలియన్ పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె ప్రస్తుతం వివిధ బ్యూటీ, టెక్స్‌టైల్ బిజినెస్‌లు రన్ చేస్తోందని, ఆమె నెట్‌వర్త్ సుమారు రూ.25 కోట్ల వరకు ఉంటుందని సమాచారం.