Movies

ఆర్యన్ రాజేష్ జీవితంలో మనకు తెలీని నిజాలు …హీరోగా ఫెయిల్ అవ్వటానికి కారణం ఏమిటో తెలుసా?

బెల్లం చుట్టూ ఈగలు మూగిన చందంగా సినిమాల్లో బాగా ఉన్నప్పుడే నలుగురూ పలకరిస్తారు. దెబ్బతిన్నామో ఇక అటువైపు చూడరు. ఇక సినీ సెలబ్రిటీలు తమ వారసులను దగ్గరుండి తీర్చిదిద్దుతారు. ట్రాక్ తప్పకుండా చూస్తారు. ఒకవేళ పెద్దవాళ్ళు లేకపోతె,వారసుల కెరీర్ కూడా ట్రాక్ తప్పేస్తుంది. ఇక అసలు విషయానికి వస్తే,డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ హఠాన్మరణం తో ఆయన పెద్దకొడుకు ఆర్యన్ రాజేష్ సినీమాల్లో బ్రేక్ లేక నిరాశలో కూరుకుపోయాడు. నిజానికి ఈవీవీ బతికుండగా ఆర్యన్ రాజేష్ ని ఘనంగా ఇండస్ట్రీకి పరిచయం చేసారు.

ఇక ఆరోగ్యం సహకరించకపోయినా కొడుకు కోసం ఈవీవీ డైరెక్షన్ చేస్తూ రిస్క్ ఫేస్ చేసారు. హాయ్ అనే మూవీతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన ఆర్యన్ కి ఆ సినిమా హిట్ తో నిలదొక్కుకుంటాడని అందరూ అనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయింది. ఎందుకంటే ఈవీవీ బతికుండగా పలు సినిమాలు ఆర్యన్ తో తీసాడు. కానీ ఆయన పోవడంతో ఎవరూ ఛాన్స్ లు ఇవ్వలేదు.

ఇక చేసేదిలేక ఇండస్ట్రీ నుంచి తప్పుకోవాలని అనుకున్నాడు. మరోవైపు అతడి తమ్ముడు అల్లరి నరేష్ కామెడీ హీరోగా రాణించినప్పటికీ ఇప్పుడు అతడు కూడా కేరక్టర్ రోల్స్ కి వేసే స్థాయికి వచ్చేసింది. ఆర్యన్,అల్లరి నరేష్ కలిపి బందిపోటు అనే మూవీ నిర్మించినప్పటికీ అది తీవ్ర నష్టాలను తెచ్చిపెట్టింది.

సినిమాలు చేతిలో లేకపోవడం ,సొంత సినిమా దెబ్బతినడంతో ఇక గంత్యంతరం లేక కేరక్టర్ రోల్స్ కి ఆర్యన్ వచ్చేసాడు. ‘ మా నాన్న ఎందరికో లైఫ్ ఇచ్చాడు. అందులో డైరెక్టర్స్ , ప్రొడ్యూసర్స్,నటులు కూడా ఉన్నారు. నా తండ్రి వలన ఎదిగిన ఏ ఒక్కరూ కూడా తనను పట్టించుకోవడం లేదు. ఇందులో ఎవరో ఒకరు చేయూతనిస్తే నా పరిస్థితి ఇలా ఉండేది కాదు’అని ఆర్యన్ కంటతడి పెట్టి చెబుతున్నాడు.

ఇండస్ట్రీ తీరే అంతగా ఉన్నప్పుడు నేనెవరినీ నిందించలేను అని ఆర్యన్ అంటున్నాడు. వినయ విధేయ రామ మూవీలో ఓ కీలక పాత్రలో ఆర్యన్ ని చూసి ఈవీవీ అభిమానులు అయ్యో అని బాధ పడుతున్నారు. అందరూ ఉండికూడా చేయూత ఇచ్చేవాళ్ళు లేక కేరక్టర్ రోల్స్ వేసుకోవాల్సి వచ్చిందని పలువురు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు