డైరెక్టర్స్,నిర్మాతలకు చుక్కలు చూపిస్తూ తలనొప్పిగా మారిన రాజేంద్రుడు
పేరుకి హాస్యనటుడే అయినా సెట్ లో మాత్రం అందుకు భిన్నంగా ఉంటూ అందరినీ ఇరుకున పెడుతూ చుక్కలు చూపించే వ్యక్తిగా నటుడు రాజేంద్ర ప్రసాద్ గురించి పలువురు అనేమాట. సినిమా షూటింగ్ లో తాను పోషించే పాత్ర వరకూ పరిమితం కాకుండా నేనే సినియర్ అనే ధోరణిలో అన్నింటా జోక్యం చేసుకోవడం అన్ని డిపార్ట్ మెంట్స్ లో వేలుపెట్టడం చేస్తుంటాడట. నిర్మాతలు,దర్శకుల విషయంలోనే కాదు ఆఖరికి హీరోయిన్స్ విషయంలో కూడా తలదూర్చడం ఇతనికున్న నైజం అని చెబుతారు. డామినేషన్ ఎక్కువగా ఉంటోందని కూడా పలువురు ఆవేదన చెందుతున్నారట. ఎన్ని చేసినా మొదటి సినిమా నుంచి ఈనాటి వరకూ ఎక్కడా కెరీర్ కి ఇబ్బంది లేకుండా వస్తున్నాడు.

ప్రస్తుతం సమంత ప్రధాన పాత్రతో వస్తున్న ఒక రీమేక్ లో రాజేంద్రప్రసాద్ జోక్యం విపరీతంగా తయారైందని అంటున్నారు. క్యారెక్టర్ నటుడిగా ఇతడు సెట్ లో వ్యవహరిస్తున్న తీరుకి దర్శక నిర్మాతలే కాదు,హీరోయిన్ సమంత కూడా విస్తుపోతోందట. అంతగా డామినేషన్ పెంచేసాడట. అతడి సీనియార్టీకి గౌరవం ఇస్తుంటే అతడు మాత్రం దాన్ని కాపాడుకోకుండా ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడం దారుణమని కొందరు నటులు అంటున్నారు. అందుకే రాజేంద్ర ప్రసాద్ తో నటించడానికి చాలామంది నటులు భయపడుతున్నారట.

గతంలో కూడా రాజేంద్రప్రసాద్ ఇలాంటి ఎన్నో చేష్టలు చేసాడని ఎంతోమంది చెబుతున్నారు. ఇటీవల ఓ ఆడియో ఫంక్షన్ లో సైతం తన కూతురు ఎవరితోనే లేచిపోయిందని చెప్పడం పలువుర్ని విస్మయానికి గురిచేసింది. ఇక శ్రేయారెడ్డి సైతం రాజేంద్ర ప్రసాద్ గురించి చాలా దారుణమైన కామెంట్స్ సోషల్ మీడియాలో చేసింది. ఇక కొన్నేళ్ల క్రితం ఒక హీరోయిన్ ఇండస్ట్రీ వదలి వెళ్లపోవడం వెనుక రాజేంద్రప్రసాద్ ప్రవర్తన కారణంగా చెబుతారు. ఇక ఓ సెట్ లో రాజేంద్ర ప్రసాద్ పై చేయిచేసుకునే వరకూ వెళ్లిందట.

ఇక కొడుకుని హీరోగా చేయాలని ప్రయత్నించి కుదరకపోయినా,మనవరాలిని మహానటి మూవీలో బుల్లి సావిత్రమ్మ గా చూపించ గలిగాడు. అయితే భవిష్యత్తులో దర్శకుడు అవ్వడం కోసమే ఇలా అన్నింట్లో తలదూరుస్తున్నాడా అనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

