Movies

40 వ వసంతంలోకి అడుగు పెట్టిన చిరు దంపతులు …స్పెషల్స్ ఏమిటో తెలుసా?

చాలామంది పుట్టినరోజు,పెళ్లిరోజు చాలా వేడుకగా జరుపుకుంటారు. జీవితంలో చాలా ఆనందకర క్షణాలుగా భావిస్తారు. ఇక సినీ నటులైతే మరీను. ఇంతకీ అసలు విషయం లోకి వెళ్తే, మెగాస్టార్ చిరంజీవి ఓ ఇంటి వాడై సరిగ్గా 39 ఏళ్లు పూర్తైపోయింది. 1978లో ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన కొణిదెల శివ శంకర వరప్రసాద్ చిన్న చిన్న సినిమాల‌తో న‌టుడిగా త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు కోసం ట్రై చేస్తున్న సమయం అది. విలన్ గా, సైడ్ క్యారెక్టర్స్ తో నెట్టుకొస్తున్నాడు. సరిగ్గా, అప్పుడే చిరుపై అప్పటి పాపులర్ కమెడియన్ అల్లు రామ‌లింగ‌య్య క‌న్ను ప‌డింది. ఈ కుర్రాడిలో ఏదో విష‌యం ఉందని పసిగట్టారు. అంతేకాదు, ఖచ్చితంగా భ‌విష్య‌త్తులో సంచ‌ల‌నాలు సృష్టిస్తాడ‌ని బలంగా అల్లు రామలింగయ్య విశ్వసించాడు.

అది అప్పట్లో పెద్దవాళ్ళ దూరదృష్టి కి నిదర్శనం. అనుకున్నట్టే చిరంజీవి తెలుగు సినిమా రంగంలో మెగాస్టార్ అయ్యాడు. సినీ రంగాన్ని ఏలాడు. అందుకే కదా ముందే ఊహించి, ఏరికోరి మ‌రీ 27 ఏళ్ల‌ కుర్రాడైన చిరుని అల్లు రామ‌లింగ‌య్య‌ త‌న ఇంటి అల్లుడిగా మార్చేసుకున్నది. చిరంజీవిగా మారిపోయి, ఆ త‌ర్వాత ఇండ‌స్ట్రీ రికార్డుల‌కు కొత్త రూపు రేఖ‌లు అద్దాడు.

ఒక్కో మెట్టు ఎక్కుతున్న స‌మ‌యంలోనే సురేఖ మెగాస్టార్ జీవితంలోకి ఎంట్రీ ఇచ్చింది. మ‌ద్రాసులో 1980, ఫిబ్ర‌వ‌రి 20న ఉద‌యం 10.04 నిమిషాల‌కు చిరంజీవి, సురేఖ వివాహం ఘ‌నంగా జ‌రిగింది. సురేఖ వ‌చ్చిన త‌ర్వాతే త‌న జీవితంలో ఎన్నో మార్పులు వ‌చ్చాయ‌ని, ఆమె వ‌చ్చిన త‌ర్వాతే త‌న కెరీర్ కూడా మారిపోయింద‌ని చాలా సార్లు మెగాస్టార్ చెప్పాడు.

ఈ జంట‌కు ముగ్గురు సంతానం. రామ్ చ‌ర‌ణ్ ఇప్ప‌టికే సూప‌ర్ స్టార్ అయిపోయాడు.. ఇక శ్రీజ‌, సుష్మిత పెళ్లిళ్లు చేసుకుని త‌మ త‌మ జీవితాలతో బిజీగా ఉన్నారు. ఇప్పుడు 2019, ఫిబ్ర‌వ‌రి 20కి చిరంజీవి, సురేఖ జోడీ 39 ఏళ్లు పూర్తి చేసుకుని 40వ ఒడిలోకి అడుగు పెట్టారు . త‌న ప్ర‌తీ గెలుపులో కూడా సురేఖ కూడా కీల‌క పాత్ర పోషించింద‌ని చిరంజీవి ఇప్ప‌టికే చాలాసార్లు చెప్పాడు . ఆమె లేక‌పోతే తాను లేనంటాడు. మొత్తానికి మెగా జంట 40వ వ‌సంతంలోకి అడుగు పెట్టిన స‌మ‌యంలో అభిమానులు విషెస్ చెప్పేస్తున్నారు.