ముస్తాబులో సైతం పోటీపడుతున్న అత్తాకోడళ్లు
సాధారణంగా చాలామంది ఈ వయసులో ఇంకా షోకులా అని అనుకుంటున్నారు గానీ సెలబ్రిటీలు మాత్రం అలాంటి ఫీలింగ్స్ దరిచేరనివ్వరు. పైగా ఇతరులు కూడా అలా అనుసరించేలా ఫోకస్ అవుతారు. ముస్తాబులో సైతం ఈ అత్తా కోడళ్ళు పోటీ పడుతూ అందరినీ ఆకర్షిస్తున్నారు. హీరో నాగ చైతన్య భార్య సమంత, అతడి తల్లి లక్ష్మి ఒకే కలర్ డ్రస్ వేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది. కలర్ అంటే ఒక్కటే కాదు, మొత్తం టాప్ టూ బాటమ్ సేమ్ టూ సేమ్ డ్రస్ దించేసారు ఈ అత్తా కోడళ్ళు. ఇద్దరూ మాట్లాడుకునే డిజైన్ చేయించుకున్నారని అంతా అనుకుంటున్నారు. అయితే అనుకోకుండా జరిగిందని సమంత చెబుతున్నా అంత అనుకోకుండా ఎలా జరుగుతుందని సోషల్ మీడియాలో ప్రశ్నలు వస్తున్నాయి.

ఇంతకీ ఎక్కడ ఈ సీన్ అంటే మార్చి 24న జైపూర్ లో విక్టరీ వెంకటేష్ కూతురు అశ్రిత పెళ్లి ఘనంగా జరిగింది. దీనికి కుటుంబమంతా హాజరైంది. ఇక ఈ పెళ్లిలో నాగచైతన్య, రానా, రామ్ చరణ్, సమంత డాన్సులు కూడా ప్రత్యేకంగా నిలిచిపోయాయి. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కూడా వచ్చాడు. అందరూ అదిరిపోయే డ్రెస్ లతో ఆకర్షించారు.

అయితే ఇప్పుడు ఒక్క ఫోటో బాగా వైరల్ అవుతూ నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఈ పెళ్లి వేడుకలో అత్త లక్ష్మిని బాగా ఫాలో అయిపోయింది సమంత అక్కినేని. అంటే నాగ చైతన్య అమ్మ అన్నమాట. ఈమె స్వయానా వెంకటేష్ చెల్లి కూడా కదా. అందుకే మేనకోడలు పెళ్లిలో దగ్గుబాటి లక్ష్మి కూడా సందడి చేసింది. సరిగ్గా సమంత కూడా ముస్తాబులో సందడి చేసింది. ఏదేమైనా అత్తా కోడళ్ళు సేమ్ టూ సేమ్ డ్రస్ వేసుకోవడం మాత్రం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

దీనిపై సమంత కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చింది. సాధారణంగా మగాళ్లు కాబోయే భార్య తల్లిలా ఉండాలని కోరుకుంటారు కదా. బహుశా అది ఇదేనేమో అంటూ తనదైన శైలిలో ఎమోషనల్ టచ్ ఇచ్చింది. మొత్తానికి చైతూ కూడా అటు అమ్మ.. ఇటు భార్యతో కలిసి డైనింగ్ టేబుల్ దగ్గర చేసిన సందడి ఇచ్చిన ఫోజు అదిరిపోయింది.

