Politics

పవన్ కోసం రంగంలోకి దిగిన అల్లు అర్జున్

మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి పవన్ కళ్యాణ్ కి మద్దతు ఊపందుకుంది. జనసేన పార్టీ ద్వారా జనంలోకి దూసుకెళ్తూ, పార్లమెంట్ ,అసెంబ్లీ అభ్యర్థుల తరపున ప్రచారం సాగిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, విశాఖ జిల్లా గాజువాక అసెంబ్లీ స్థానాల నుంచి పవన్ ఎమ్మెల్యేగా పోటీచేస్తుంటే,నరసాపురం లోక సభ బరిలో మెగా బ్రదర్ నాగబాబు ఉన్నారు. ఎన్నికలకు సమయం దగ్గర పడింది. ప్రచారానికి కూడా ఇక మూడు రోజులే సమయం ఉంది.

ప్రచారం తారాస్థాయికి చేరడంతో ఏప్రియల్ 9సాయంత్రం 4గంటలతో పూర్తి చేయాల్సి ఉంటుంది. 11వ తేదీన ఉదయం నుంచి సాయంత్రం వరకూ పోలింగ్ జరుగనుంది. అధికార టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు,విపక్ష నేత,వైకాపా అదినేత జగన్ ఉగాది శుభవేళ ఎన్నికల ప్రణాళికలను విడుదల చేసారు. సంక్షేమ కార్యక్రమాలను పోటాపోటీగా మేనిఫెస్టోలో పొందుపరిచారు.

ఇక అల్లు అరవింద్ తనయుడు,పవర్ స్టార్ పవన్ మేనల్లుడు అల్లు అర్జున్ జనసేనకు మద్దతు ప్రకటించాడు. ఈమేరకు తన అభిప్రాయాలను వెల్లడిస్తూ, ‘మా మద్దతు మీకే’ అని ఓ లేఖను బన్నీ విడుదల చేసాడు. మేము సీన్ లో లేకపోయినా తమ మద్దతు సమాజ సేవకు ఎప్పుడూ ఉంటుందన్నాడు. ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాలను ఎంచుకున్న నాగబాబుకు శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు బన్నీ పేర్కొన్నాడు. ప్రజలు జీవితాల్లో కొత్తవెలుగులు తీసుకువస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నాడు.