Movies

మా గడ్డం మా ఇష్టం.. గడ్డంతో సంచలనాలు సృష్టించిన హీరోలు

ట్రెండ్ ని బట్టి సినిమా వాళ్ళు నడుస్తారు. ట్రెండ్ క్రియేట్ చేసేది వాళ్ళే .. అందుకే హెయిర్ స్టైల్ పై ఎంత శ్రద్ధ చూపిస్తారో గడ్డంపై కూడా కొందరు హీరోలు అలాగే శ్రద్ధ వహిస్తారు. గడ్డం మగవాళ్ళు సరిగ్గా పెంచితే చూడటానికి చాలా అందంగానే ఉంటుంది. అందుకే కొందరు హీరోలు అలాంటి అందం వైపు మళ్లుతున్నారు. ఈ మధ్య కాలంలో తెలుగు ఇండస్ట్రీలో గడ్డం గ్యాంగ్ బాగానే పెరిగిపోయింది. ఇక దర్శకుల దృష్టి కూడా గడ్డం హీరోల గ్యాంగ్ పై పడింది. మరీ ముఖ్యంగా మన హీరోలు ఇలా గడ్డంతో వచ్చి సంచలన విజయాలు అందుకున్నారు .

తాజాగా శ్రీ విష్ణు నటించిన తిప్పరా మీసం ఫస్ట్ లుక్ విడుదలైంది. ఇందులో కూడా ఆయన గడ్డంతోనే కనిపిస్తున్నాడు.ఇప్పటివరకు ప్రతి సినిమాలో చిన్న చిన్న గడ్డంతో కనిపించిన శ్రీవిష్ణు ఈ సినిమా కోసం ఏకంగా కోరమీసాలు పెంచి గుబురు గడ్డంతో రఫ్ లుక్ లోకి మారిపోయాడు. ఈయన కంటే ముందు చాలా మంది హీరోలు గడ్డంతో సంచలనం సృష్టించారు.

ముఖ్యంగా రామ్ చరణ్ రంగస్థలం సినిమాలో బాగా ఆకట్టుకున్నాడు. ఆయన క్యారెక్టర్ చిట్టిబాబు ఎంత ఫేమస్ అయిందో, ఆయన గడ్డం స్టైల్ కూడా అంతే ఆకట్టుకుంది. అది ఇంతదాకా వెళ్లిందంటే, రంగస్థలం గడ్డం అంటూ చరణ్ ను యూత్ ఫాలో అవుతున్నారు .
NTR
దానికంటే ముందు సుకుమార్ తెరకెక్కించిన నాన్నకు ప్రేమతో సినిమాలో కూడా ఎన్టీఆర్ గడ్డం బాగా క్లిక్ అయింది. ఆ స్టైల్ ను చాలా మంది కాపీ కొట్టారు.
Maharshi mahesh babu
ఎప్పుడూ క్లీన్ షేవ్ తో ఉండే మహేష్ బాబు కూడా తాజాగా మహర్షి సినిమాలో గడ్డంతోనే దర్శనమిస్తున్నాడు. మొత్తానికి మహేష్ ని తన సినిమా కథతో వంశీ పైడిపల్లి ఒప్పించాడు. ఆవిధంగా మహేష్ బాబును గడ్డంలో చూసే అవకాశం ఫాన్స్ కి దక్కింది.

ఆ మధ్య శర్వానంద్ కూడా పడి పడి లేచే మనసు సినిమాలో కాసేపు గడ్డంతో కనిపించాడు. నితిన్ లై సినిమా కోసం ఒక స్టైలిష్ గడ్డంని తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఇక నాని కూడా ఎప్పటికప్పుడు తన సినిమాల్లో గడ్డంతోనే కనిపిస్తుంటాడు.

మెగా వారసుడు వరుణ్ తేజ్ కూడా గడ్డం పెంచడంలో కింగ్ అయిపోయాడు. తన ప్రతి సినిమాలో ఇలా గడ్డంతో కనిపిస్తూ విజయాలు నమోదు చేసుకుంటున్నాడు.