వైసిపిలో అప్పుడే పదవులపై ఆశలు – కీలక శాఖపై రోజా గురి
ఏప్రియల్ 11న ఏపీలో పొలింగ్ ముగియడంతో పార్టీలన్నీ గెలుపుపై ఎవరి లెక్కలు వారు వేసుకుంటూ బిజీ అయ్యాయి. 130 స్థానాలతో తామే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని టీడీపీ ధీమా వ్యక్తం చేస్తోంటే, వైసీపీ కూడా అదే ధీమాతో ఉంది. అయితే వైసిపి నేతలు మరో అడుగు ముందుకేసి, తమ పార్టీ అధికారంలోకి రాబోతుందని పక్కాగా డిసైడ్ అయిపోయారు. జగన్ పార్టీలో కీలక నేతలు పార్టీ అధికారంలోకి వచ్చేసిందని ఫీల్ అవుతున్నారు. అంతేకాదు, పైరవీలు స్టార్ట్ చేసేశారు. కీలక పదవులపై దృష్టి సారించేసారు. తమకు ఏ పదవి అయితే బాగుంటుందో అని లేకెక్కలేసుకుంటూ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు.

దీంతో తమకు ఏ మంత్రి పదవి కావాలో కూడా నిర్ణయించుకొని జగన్ వద్ద ప్రతిపాదనలు చేస్తోన్నట్లు టాక్.ఇందులో భాగంగా పార్టీలో చేరిన కొద్ది రోజుల్లోనే పార్టీలో కీలక గొంతుగా మారిన రోజా ఈ అంశంలో కాస్త ముందున్నారు. ఫలితాలు వెల్లువడితన తరువాత తమ పార్టీకి భారీ మెజార్టీ రావడంతోపాటు తాను పోటీ చేస్తోన్న నగరి నియోజకవర్గం లోకూడా భారీ మెజార్టీతో గెలుస్తానన్న ధీమా వ్యక్తంచేస్తూ, వైసీపీ ప్రభుత్వం ఏర్పాడితే కీలక మంత్రి పదవి పై ఆమె కన్నేసినట్లు తెలుస్తోంది. గతంలో రాజశేఖరరెడ్డి హాయంలో చేవెళ్ల చెల్లెమ్మ అంటూ సబితా ఇంద్రారెడ్డికి రాష్ట్ర హోంమంత్రి పదవి ఇచ్చి పార్టీలో మహిళలను వైఎస్ ఎలా గౌరవించారో, అదే తరహాలో జగన్ కూడా తనకు హోంమంత్రి పదవి కట్టబెడతారాని గంపెడు ఆశలు రోజా పెట్టుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా నాలుగెళ్లు ప్రతిపక్షంలో తాను పార్టీ కోసం ఎంత కష్టపడ్డానో జగన్ గుర్తిస్తారని రోజా ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. తన వద్దకు వచ్చిన సన్నిహితులతో కూడా రోజా ఇదే ప్రస్తావిస్తున్నారట. ఖచ్చితంగా జగన్ తనకు హోం శాఖ కాకపోతే ఏం ఇస్తార ని రోజా ధీమా తో ఉందట. అలాగే వైసీపీలో ఉన్న మరికొంత మంది నేతలు కూడా తమకు ఏ మంత్రి పదవి కావాలో వాటి కోసం ఇప్పటి నుంచి జగన్ వద్దకు ప్రతిపాదనలు తీసుకెళ్లుతున్నట్లు వైసీపీ వర్గాల టాక్. మరో వైపు టీడీపీ నేతలు వైసీపీ అతి వ్యవహారం చూసి నవ్వుకుంటున్నారు.

అసలు పార్టీ గెలుపు మాట పక్కన పెట్టి జగన్ పార్టీ తరుపున పోటీ చేసిన వాళ్లు గెలుస్తారో లేదో ముందు చూసుకోవాలని టీడీపీ నేతలు ఎద్దెవా చేస్తోన్నారు. పోలింగ్ తురువాత ఇంకా ఫలితాలు రాకముందే వైసీపీ అధినేతతో సహా అందరు అధికారం కోసం ఎంతలా తహాతహాలాడుతున్నారో అర్దం చేసుకోవచ్చని టీడీపీ నేతలు అంటున్నారు. జగన్ అధికారంలోకి రావడం కలగానే మిగిలిపోతుందని టీడీపీ130 స్థానాలతో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందని ధీమా గా చెబుతున్నారు. వైసిపి ఆశలు అడియాశలు కాగలవని వ్యాఖ్యానిస్తున్నారు. ఇంకా నెలకు పైగా ఆగితే తప్ప విషయం బయటకు రాదు.

