RRR మూవీలో ఎవరికి ఎంత రెమ్యునరేషన్…. తెలిస్తే షాక్ అవుతారు
ఆడియన్స్ నాడిని ముందుగానే పసిగట్టి అందుకనుగుణంగా సినిమాలు చేసే ఎస్ ఎస్ రాజమౌళి బాహుబలి తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లతో మల్టీస్టారర్ మూవీ చేస్తున్నాడు. నిర్మాత డివివి దానయ్య 300కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తీస్తున్న ఈ సినిమా ఆర్ ఆర్ ఆర్ అనే వర్కింగ్ టైటిల్ తో జక్కన్న తీస్తున్నాడు. అయితే ఈ మూవీ థియేటర్స్ దగ్గర ఎలాంటి కాసుల వర్షం కురిపిస్తుందో తెలీదు కానీ, ఇందులో నటించేవాళ్లకు, టెక్నీషియన్స్ కి డబ్బే డబ్బు అన్నట్టు ఉందట. కోటి నుంచి రెండు కోట్ల రూపాయల రెమ్యునరేషన్స్ ఇస్తున్నారట. అంతేకాదు కొన్ని పాత్రలకు ఎంత అడిగితె అంతా ఇవ్వడానికి నిర్మాత, దర్శకుడు సై అనేస్తున్నారట.

ఇక ఆర్ ఆర్ ఆర్ లో మొదటి ఆర్ ఎవరంటే దక్షిణాదిలోనే హయ్యస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే రాజమౌళి అని చెప్పొచ్చు. ఎందుకంటే తమిళ డైరెక్టర్ శంకర్ 2.ఓ మూవీకి ఎంత తీసుకున్నాడో చెప్పలేం కానీ, బాహుబలికి 28కోట్లు తీసుకున్న జక్కన్న ఆర్ ఆర్ ఆర్ కి మాత్రం 33కోట్లు తీసుకుంటున్నాడట. సౌత్ ఇండియాలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న డైరెక్టర్ గా దీన్ని బట్టి చెప్పొచ్చు. బాహుబలి 1,2ల ద్వారా 2వేలకోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి. అందుకే జక్కన్నకు అధిక మొత్తం ఇవ్వడానికి ప్రొడ్యూసర్ దానయ్య ముందుకొచ్చాడు.

ఇక మరో ఆర్ ఆర్ లు ఎవరంటే రామ్ చరణ్,జూనియర్ రామారావు (తారక్). రంగస్థలంతో బ్లాక్ బస్టర్ అందుకున్న రామ్ చరణ్ ఆ మూవీతో 250కోట్ల రూపాయల భారీ కలెక్షన్స్ అందుకున్నాడు. అలాగే అరవింద సమేతతో బ్లాక్ బస్టర్ అందుకున్న తారక్ ని కూడా ఇందులో తీసుకున్నారు. ఇద్దరికీ చెరో ముప్పై కోట్లు ఇస్తున్నారట.

ఇలా ఆర్ ఆర్ ఆర్ లో ఈ ముగ్గురికీ రెమ్యునరేషన్ కింద వందకోట్లు దాకా అందిస్తుంటే, ఇక హీరోయిన్స్ అలియా భట్,పరిణితి చోప్రా వంటి వాళ్ళను తీసుకున్నారు. అయితే రాజి అనే తాజా హిట్ తో కొండెక్కి కూర్చుంది. ఈమెకు 12నుంచి 15కోట్లు ఇవ్వడానికి నిర్మాత ఒకే చెప్పేసాడు. నిజానికి బాహుబలిలో వేసిన అనుష్క,తమన్నాలపై రెండు బాహుబలి మూవీస్ కి కల్పి చెరో 5కోట్లు ఇచ్చారట. మరి ఆర్ ఆర్ ఆర్ కోసం అలియా భట్ కి ఇంతపెద్ద మొత్తమా అని ఆశ్చర్య పోతున్నారట. సౌత్ లో ఒక్క నయనతార మాత్రమే 2న్నర కోట్ల రూపాయల మొత్తం తీసుకుంటుంటే,అలియా భట్ కి అంతపెద్ద మొత్తం ఇవ్వడం ఆశ్చర్యమేమరి.

ఇక ఈ సినిమా కోసం రకుల్ ప్రీత్ సింగ్, జాన్వీ కపూర్,కీర్తి సురేష్,కైరా అద్వానీ, సారా అలీఖాన్,రాశిఖన్నా వంటి అందాల భామల పేర్లు కూడా ఈ సినిమాకోసం వినిపిస్తున్నాయి. వీళ్ళు కూడా ఈసినిమాలో ఆయా పాత్రల్లో వేయడానికి,వీళ్ళు తీసుకునే రెమ్యునరేషన్ కి రెట్టింపు ఇవ్వడానికి దానయ్య ఒకే అన్నాడట.

ఇక అజయ్ దేవగన్ లాంటి వాళ్ళను కూడా అధిక పారితోషికం ఇచ్చి ఈ మూవీలోకి తీసుకుంటారట. కృష్ణం వందే జగద్గురుమ్ , కంచె, మహానటి వంటి బ్లాక్ బస్టర్స్ కి మాటలు రాసిన బుర్రా సాయిమాధవ్ కి ఈ సినిమాలో 75లక్షలు అత్యధిక రెమ్యునరేషన్ ఇస్తున్నారట. గతంలో మన్మధుడు మూవీకి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇంతమొత్తం తీసుకున్నాడట. దానితర్వాత సాయిమాధవ్ అంతటి మొత్తం ఇస్తున్నారట. టివి సీరియల్స్ కి రచయితగా ఉండే సాయిమాధవ్ ని డైరెక్టర్ క్రిష్ వెండితెరకు తెచ్చాడు, గౌతమీ పుత్ర శాతకర్ణి,ఎన్టీఆర్ బయోపిక్, అలాగే ఇప్పుడు సైరా మూవీ కి కూడా సాయిమాధవ్ రచయితగా ఉన్నాడు.

