ఈ ఇద్దరు హీరోలు గుర్తు ఉన్నారా ఇప్పుడు ఎక్కడ ఏమి చేసున్నారు?
సినిమా ఇండస్ట్రీలో ఎవరు ఎప్పుడెలా ఉంటారో తెలీదు. ఈ రోజు టాప్ ప్లేస్ లో ఉన్నా ,రేపు ఎలా అవుతారో చెప్పలేం. ఫుల్ బ్యాక్ గ్రౌండ్ ఉంది నిలదొకొక్కున్న వాళ్ళూ వున్నారు, దెబ్బతిన్నవాళ్లూ ఉన్నారు. అలాగే ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి మంచి పొజిషన్ కి వచ్చినవాళ్లు , రానివాళ్ళూ ఉన్నారు. ఇక మంచి పొజిషన్ లో ఉండగా కెరీర్ అర్ధాంతరంగా ముగించి, ఇండస్ట్రీకి దూరం అయినవాళ్ళూ ఉన్నారు. కొందరు ఎడ్రెస్ లేకుండా పోతున్నారు.

కానీ వాళ్ళను ఆడియన్స్ మాత్రం మరిచిపోవడం లేదు. ఇందులో మొదటగా చెప్పాలంటే టివి టవర్ అనగానే గుర్తొచ్చే హీరో వేణు. ఇతడి పూర్తి పేరు తొట్టెంపూడి వేణు. ఎన్నో హిట్ మూవీస్ లో నటించి ఆడియన్స్ మదిలో చెరగని ముద్ర వేసుకున్నాడు. స్వయంవరం మూవీతో 1999లో ఎంట్రీ ఇచ్చిన వేణు ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాడు. నంది అవార్డుల వేడుకలో స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకున్నాడు. 2000సంవత్సరంలో వచ్చిన చిరునవ్వుతో మూవీ కూడా మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. హనుమాన్ జంక్షన్, కళ్యాణ్ రాముడు,చెప్పవే చిరుగాలి,పెళ్ళాం ఊరెళితే వంటి సినిమాల్లో నటించి కామెడీ హీరోగా పాపులర్ అయ్యాడు. తెలుగులో మరో రాజేంద్ర ప్రసాద్ లాంటి నటుడు దొరికాడని అనుకునే లోగా , ఏమైందో ఏమోగానీ సినిమాలకు పూర్తిగా దూరం అయ్యాడు. రామాచారి సినిమాతో వేణు హీరోగా చివరి మూ

వీ అయింది. ఇక ఆ ఆమధ్య జూనియర్ ఎన్టీఆర్ నటించిన దమ్ము సినిమాలో గెస్ట్ రోల్ లో నటించి మెప్పించిన వేణు ఆతర్వాత హీరోగా కాదు కదా, సపోర్టింగ్ రోల్స్ లో కూడా కనిపించకుండా పోయిన సీనియర్ హీరోల్లో ఒకడిగా మిగిలిపోయాడు. ఇక పలు హిట్ చిత్రాల నిర్మాత వడ్డే రమేష్ తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వడ్డే నవీన్ ‘పెళ్లి’ వంటి ఎన్నో హిట్ చిత్రాలు చేసి మెప్పించాడు. ఇతడి చివరి మూవీ శ్రీమతి కళ్యాణం. ఆతర్వాత ఎటాక్ మూవీలో సపోర్టింగ్ రోల్ లో దర్శనం ఇచ్చిన నవీన్ ఆతర్వాత ఎడ్రెస్ లేకుండా పోయాడు. ఇలా చాలామంది హీరో హీరోయిన్స్ ఏవేవో కారణాల వలన ఇండస్ట్రీకి దూరం అయ్యారు..

