బోయపాటి రూట్ మార్చేస్తున్నాడా…. బాలకృష్ణ హ్యాండ్ ఇచ్చాడా?
ఎంత స్టార్ డైరెక్టర్ అయినా ఒక్క సినిమా డిజాస్టర్ అయితే చాలు అటువైపు కన్నెత్తి చూడ్డానికి చాలామంది భయపడుతున్నారు. సరిగ్గా బోయపాటి పరిస్థితి అలానే ఉంది. ఎందుకంటే రామ్ చరణ్ తో తీసిన వినయ విధేయ రామ దారుణంగా దెబ్బ తినడం బోయపాటి కి డబుల్ దెబ్బ తగిలేసింది. క్యాలిబర్ మీద డౌట్ వచ్చేలా చేయడం, దానికన్నా ముందే కమిట్ అయిన బాలయ్య తనది వాయిదా వేసి కెఎస్ రవికుమార్ కు ఛాన్స్ ఇవ్వడం తో పాపం బోయపాటి పరిస్థితి ఎలా తయారైందో అని సినీ జనాలు అనుకుంటున్నారు. ఒకవేళ రామ్ చరణ్ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యుంటే బోయపాటి రేంజ్ మరోలా ఉండేది.
కానీ వినయ విధేయ రామ డిజాస్టర్ తో భారీ బడ్జెట్ లతో బోయపాటితో రిస్క్ చేయాలంటే ఇప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో పూర్తిగా డిఫెన్స్ లో పడిన బోయపాటి శీను రూట్ మార్చుకున్నాడని అంటున్నారు. బాలయ్య-రవికుమార్ ల సినిమా పూర్తయ్యే లోపు తాను వేరే హీరోతో ఇంకో ప్రాజెక్ట్ పూర్తి చేసే ఆలోచన చేస్తున్నట్టు ఫిలిం నగర్ లో వినిపిస్తున్న టాక్. అయితే హీరో ఎవరైనా కనీసం ఏడాదిన్నర నుంచి రెండేళ్ళ టైం తీసుకునే బోయపాటి నిజంగా ఇలా చేస్తాడా అని కూడా అంటున్నారు.
బోయపాటి ముందున్న సవాల్ ఏమిటంటే, బాలకృష్ణకు నచ్చే కథ రాసుకోవాలి. అంతకు ముందే తన స్టామినా ఏమిటో నిరూపించుకోవాలి. మీడియం రేంజ్ హీరో ఎవరితోనైనా ఈజీ బడ్జెట్ లో పవర్ ఫుల్ సబ్జెక్టుతో ఓ హిట్టు కొడితేనే అది సాధ్యం అవుతుంది. అదే సమయంలో బాలయ్యకు స్క్రిప్ట్ రెడీ చేయాలి. ఇలా ఏకకాలంలో రెండు కీలక అంశాలపై దృష్టి పెట్టడం అంటే అంత ఈజీ కాదు. ఇలా ఎన్నో విషయాలు పైకి వినిపిస్తున్నా, బోయపాటి మాత్రం అసలు బయటకు రావడం లేదు. ఎందుకంటే కనీసం ఇతర హీరోల దర్శకుల సినిమా వేడుకలకు వచ్చిన దాఖలాలు లేవు. అయితే స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉండడం వలన బోయపాటి కనిపించడం లేదని, తానేమిటో రుజువు చేసుకునే పనిలో ఉన్నాడని అంటున్నారు.

