Movies

రాజమౌళి సినిమాకే ఇలా ఎందుకు జరుగుతుంది !

పక్కా ప్లాన్ ప్రకారం దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి సినిమా చేస్తాడు. అందుకే ఓపినింగ్ రోజు నుంచి షెడ్యూల్ , రిలీజ్ డేట్ వరకూ అన్నీ ముందుగానే పక్కాగా ప్రకటిస్తాడు. కానీ ఈ మధ్య భారీ ప్రాజెక్ట్స్ చేపట్టడం వలన అనుకున్న సమయానికి సినిమాలు విడుదల కావడం లేదు. బాహుబలి వన్, బాహుబలి 2విషయంలో కూడా ఇదే జరిగింది. నిజానికి భారతీయ సినిమా వైపు,మరీ ముఖ్యంగా తెలుగు సినిమా వైవు ప్రపంచమే చూసేలా బాహుబలితో జక్కన్న చేసి చూపించాడు. ఇక ప్రతిష్టాత్మకంగా మల్టీస్టారర్ మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తూ ఆర్ ఆర్ ఆర్ వర్కింగ్ టైటిల్ పెట్టారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లను హీరోలుగా పెట్టి తీస్తున్న ఈ సినిమాను డివివి దానయ్య భారీ వ్యయంతో నిర్మిస్తున్నాడు. సినిమా షూటింగ్ మొదలై శరవేగంగా జరుగుతున్న సమయంలో ప్రెస్ మీట్ పెట్టి మరీ 2020జులై 30న సినిమా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇది పక్కా డేట్ అని అడగ్గా అవునని కూడా జక్కన్న చెప్పాడు. కానీ ఇప్పుడు ఈ డేట్ కి సినిమా రిలీజ్ అవుతుందో లేదోనని అందరిలో ఒకటే ఆందోళన మొదలైంది.

దీనికి కారణం లేకపోలేదు. ఈ చిత్రం లో నటిస్తున్న హీరో రామ్ చరణ్ కి హీరోయిన్ ఫిక్స్ అయినప్పటికీ తారక్ పక్కన నటించే హీరోయిన్ ఎవరో తేలలేదు. ఇక రామ్ చరణ్ జిమ్ చేస్తూ గాయం అవ్వడంతో మూడు వారాలకు విశ్రాంతి తప్పలేదు. దీనికి తోడు జూనియర్ ఎన్టీఆర్ కి కూడా చిన్న గాయం అయిందని వార్తలు రావడంతో దాదాపు నెలరోజుల పాటు షూటింగ్ కి అంతరాయం ఏర్పడింది. మరి డెడ్ లైన్ ప్రకారం 2020జులై 20కి సినిమా విడుదల అవుతుందా లేదా అనేది చూడాలి.