రానా సినిమాల్లోకి రాక ముందు ఏమి చేసేవాడో తెలుసా?
మూవీ మొఘల్,స్టార్ ప్రొడ్యూసర్ డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు మనవడిగా, నిర్మాత డి సురేష్ బాబు తనయుడిగా సినీ బ్యాక్ గ్రౌండ్ తో చిత్ర సీమలోకి అడుగుపెట్టిన రానా తక్కువకాలంలోనే ఎక్కువ పాపులర్ అయ్యాడు. తాను పోషించే పాత్ర కనిపించాలన్నదే రానా గొప్ప లక్షణం. అందుకే హీరోగా చేస్తూనే విలన్ గా కూడా మెప్పించి, సైమా,ఐఫా , ఫిలిం ఫేర్,నంది వంటి ఎన్నో అవార్డులు అందుకున్నాడు. రానా అసలుపేరు దగ్గుబాటి రామానాయుడు. 1984డిసెంబర్ 14న జన్మించిన రానా తండ్రి సురేష్ బాబు ఎన్నో విజయవంతమైన మూవీస్ లో నటించాడు. తల్లి లక్ష్మి గృహిణి. బాబాయ్ వెంకటేష్ స్టార్ హీరో. ఇక చిన్నప్పటినుంచి చదువుపై దృష్టిలేని రానా కి పది పాసవ్వడమే చాలా కాలం పట్టింది. రానాకు ఫిలిం మేకింగ్ మీద ఆసక్తి ఉండడంతో తాతయ్య రామానాయుడు ఏనాడూ ఆందోళన చెందలేదు.
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్,చెన్నైలో చదువు పూర్తిచేసి, చెన్నై ఫిలిం స్కూల్ లో పలు కోర్సులు పూర్తిచేసాడు. ఇండస్ట్రియల్ ఫోటోగ్రఫీలో గ్రాడ్యుయేషన్ చేసిన రానాకు చిన్నప్పటి నుంచి కంటి సమస్య ఉండడంతో 14వ ఏటనే కంటికి సర్జరీ చేయించుకున్నాడు.. విజువల్ ఎఫెక్ట్స్ కో ఆర్డినేటర్ గా తెలుగు,హిందీ సినిమాల్లో చేసాడు. సైనికుడు మూవీకి స్పెషల్ ఎఫెక్ట్స్ అందించి,2006లో నంది అవార్డు అందుకున్నాడు. ఇలా తెరవెనుకకు పరిమితమైన రానాను శేఖర్ కమ్ముల లీడర్ మూవీతో హీరోగా పరిచయం చేసాడు. తన నటనతో అందరిని మెప్పించి తొలిచిత్రంతోనే విజయం దక్కించుకుని ఫిలిం ఫేర్ అవార్డు అందుకున్నాడు.
అభిషేక్ బచ్చన్, బిపాసా బసులోతో కల్సి దమ్ మేరె దమ్ మూవీతో బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు. టైమ్స్ ఆఫ్ ఇండియా అవార్డు అందుకున్నాడు. నేను నా రాక్షసి, నా ఇష్టం వంటి తెలుగు మూవీస్ లో, డిపార్ట్ మెంట్ అనే హిందీ మూవీలో నటించినా పెద్దగా పేరు రాలేదు. కృష్ణం వందే జగద్గురుమ్ మూవీతో మెప్పించిన రానా సైమా అవార్డు పొందాడు. మరోపక్క తమిళంలో అజిత్ చిత్రంలో ప్రత్యేక రోల్ లో కనిపించి మెప్పించాడు. ఇక ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలిలో భల్లాలదేవ పాత్రలో రానా అద్వితీయ నటన కనబరిచి, విలన్ గా తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. వరల్డ్ వైడ్ గా రానాకు బాహుబలి రెండు భాగాలూ కొత్త ఇమేజ్ తెచ్చాయి.
ఫిలిం ఫేర్ అవార్డు లభించింది. ఉత్తమ్ విలన్ గా నంది బహుమతి అందుకున్నాడు. రాజరథం మూవీకి రానా అందించిన గాత్రం కీలకం అయింది. అతడి మాటలు స్పెషల్ ఎట్రాక్షన్ అయ్యాయి. రుద్రమదేవి లో ప్రత్యేక పాత్ర చేసాడు. అలాగే ఘాజి వంటి హిందీ మూవీలో నటించి తన సత్తా చాటాడు. నేనే రాజు నేనే మంత్రి అనే మూవీలో నటించి ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోగలనని నిరూపించాడు. సినీ అవార్డులకు వ్యాఖ్యాతగా తనసత్తా చాటిన రానా ఇక ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు,మహానాయకుడు లలో సీఎం చంద్రబాబు పాత్రలో ఒదిగిపోయాడు.

