Movies

అప్పుడు సినిమాల్లో,ఇప్పుడు జబర్దస్త్ లో రోజా, మీనా కల్సి …

ఒకప్పుడు రోజా , మీనా వీళ్లిద్దరు కల్సి ‘ముఠామేస్త్రీ’,‘బొబ్బిలి సింహం’ వంటి కొన్ని సినిమాల్లో నటించారు. అయితే అప్పట్లో రోజా కంటే ముందు మీనా హీరోయిన్‌గా స్టార్ స్టేటస్ అందుకుంది. ఆ తర్వాత వీళ్లిద్దరు టాలీవుడ్. కోలీవుడ్‌లో తమదైన శైలిలో హీరోయిన్స్‌గా రాణించారు. ఇక ఇప్పుడు ఈటివి టాప్ రేటింగ్ షో జబర్ధస్త్‌లో ఏం జరుగుతోందని చూస్తే, గత కొన్ని రోజులుగా ఎన్నికల హడావుడితో రోజా ఈ కార్యక్రమానికి జడ్జ్‌గా రాలేకపోయింది. అయితే ఆమె ప్లేస్‌లో సీనియర్ హీరోయిన్ మీనా ఎంట్రీ ఇచ్చింది. అలాగే నాగబాబు కూడా ఎంపీగా పోటీ చేయడంతో ఆయన ప్లేస్‌లో ఒక రోజు శేఖర్ మాస్టర్, మరో రోజు జానీ మాస్టర్ జడ్జెస్‌గా వ్యవహరించారు.

ఇక ఎన్నికల హడావుడి ముగిసిన తర్వాత రోజా మరోసారి జబర్ధస్త్‌ జడ్జ్‌గా రీ ఎంట్రీ ఇవ్వ బోతోంది. అయితే ఈ శుక్రవారం మీనాతో పాటు రోజా జబర్ధస్త్ జడ్జ్ గా ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. ఇప్పటి వరకు విడివిడిగా జబర్ధస్త్‌గా జబర్ధస్త్ జడ్జెస్‌గా వ్యవహరించిన వీళ్లిద్దరు ఫస్ట్ టైమ్ ఒక వేదికపై జడ్జెస్‌గా ఎలా వ్యవహరిస్తారనేది ఆసక్తికరంగా మారింది.సినిమాల్లో ఒకరితో ఒకరు పోటీ పడ్డ వీళ్లిద్దరు ఇపుడు జబర్ధస్త్ జడ్జెస్‌గా ఎలా ఆడియన్స్‌ను మెస్మరైజ్ చేస్తారో అని ఆడియన్స్ సహజంగానే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జబర్ధస్త్ జడ్జ్‌గా రోజా పాపులారిటీ వీరెలెవెల్లో ఉంది. ఈ ప్రోగ్రాంతో రోజా కామన్ ఆడియన్స్ కి చాలా దగ్గరైంది. మరి ఇపుడిపుడే తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరవుతోన్న మీనా ఇక ముందు ఎలాంటి సంచలనం క్రియేట్ చేయనుందో చూడాలి.