Movies

ఈ హీరో ఎన్ని కష్టాలు పడ్డాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

నేను హీరో కాకముందు ఎన్నో కష్టాలు అనుభవించానని , దర్శక నిర్మాతలకు సిగరెట్లు , టీ , కాఫీ లను అందించానని సంచలన వ్యాఖ్యలు చేసాడు కన్నడ స్టార్ హీరో యష్ . తాజాగా ఓ మీడియా సంస్థ కు ఇంటర్వ్యూ ఇచ్చిన యష్ తన పాత రోజులను గుర్తుకు తెచ్చుకున్నాడు . యష్ ఓ సామాన్య బస్ డ్రైవర్ అన్న విషయం తెలిసిందే . అయితే సినిమాల మీద మక్కువతో పలువురు సినిమా వాళ్ళ దగ్గర పనిచేసాడు హీరో కాకముందు .

అప్పుడు వాళ్లకు టీలు కాఫీలు , సిగరెట్లు అందిస్తూ బోలెడు పనులు చేసాడట ! అయితే అలా చేసిన యష్ ఇప్పుడు కన్నడ సూపర్ స్టార్ అయ్యాడు . కేజీఎఫ్ చాప్టర్ 1 తో దక్షిణాదిన సంచలనం సృష్టించాడు . ఇక ఇప్పుడేమో చాప్టర్ 2 తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు . అంచలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు భోగభాగ్యాలతో తులతూగుతున్నాడు యష్ . గత ఏడాది కేజీఎఫ్ తో సంచలనం సృష్టించిన యష్ కు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఏర్పడింది .