వరల్డ్ కప్ లో ఏ సంవత్సరంలో ఏ దేశం కప్ గెలిచిందో….???
అసలు మన దేశంలో క్రికెట్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. క్రికెట్ అనగానే చాలు చిన్న పెద్ద అని తేడా లేకుండా గెంతులేస్తారు. ఇక ఇప్పుడు క్రికెట్ ప్రియులందరు వరల్డ్ కప్ కోసం ఎదురుచూస్తున్నారు. అసలు క్రికెట్ వరల్డ్ కప్ అనేది 1975 లో ప్రారంభమైంది. ఈ పోటీ నాలుగు సంవత్సరాలకు ఒక సారి నిర్వహించబడుతుంది. మనం ఇప్పటివరకు జరిగిన వరల్డ్ లో ఫైనల్స్ కు వెళ్లిన జట్టులు గురించి తెలుసుకుందాం.
1975 వ సంవత్సరంలో ఫైనల్ వరల్డ్ కప్ మ్యాచ్ లండన్ లో నిర్వహించారు. ఈ సంవత్సరంలో ఫైనల్స్ ఆస్ట్రేలియా కి వెస్ట్ ఇండీస్ కి మధ్య ఎంతో హోరాహోరీగా సాగింది. చివరికి వెస్ట్ ఇండీస్ 17 పరుగుల తేడాతో విజయం సాధించింది.
1979 వ సంవత్సరం ఫైనల్ వరల్డ్ కప్ మ్యాచ్ కూడా లండన్ లో నే నిర్వహించబడినది. ఈ సంవత్సరం లో ఫినల్స్ వెస్ట్ ఇండీస్ కి ఇంగ్లాండ్ కి మధ్యన జరిగింది. ఈ మ్యాచ్ లో వెస్ట్ ఇండీస్ 91 పరుగుల తేడాతో నెగ్గింది.
1983 వ సంవత్సరం లో ఫైనల్ వరల్డ్ కప్ మ్యాచ్ కూడా లండన్ లో నే నిర్వహించబడినది. ఈ సంవత్సరం లో మన భారత దేశం వెస్ట్ ఇండీస్ పై విజయం సాదించింది.
1987 వ సంవత్సరం లో ఫైనల్ వరల్డ్ కప్ మ్యాచ్ మన భారత దేశం లో నిర్వహించబడినది . ఈ సంవత్సరం లో ఇంగ్లాండ్ పై ఆస్ట్రేలియా విజయం సాధించింది.
1992 వ సంవత్సరం లో ఫైనల్ వరల్డ్ కప్ మ్యాచ్ ఆస్ట్రేలియా లో నిర్వహించబడినది. ఈ సంవత్సరం లో పాకిస్తాన్ ఇంగ్లాండ్ పై విజయం సాధించింది.
1996 వ సంవత్సరం లో ఫైనల్ వరల్డ్ కప్ మ్యాచ్ పాకిస్తాన్ లో నిర్వహించబడినది. ఈ సంవత్సరం లో శ్రీ లంక ఆస్ట్రేలియా పై విజయం సాదించింది.
1999 వ సంవత్సరం లో ఫైనల్ వరల్డ్ కప్ మ్యాచ్ లండన్ లో నిర్వహించబడినది. ఈ సంవత్సరం లో ఆస్ట్రేలియా పాకిస్తాన్ పై విజయం సాధించింది.
2003 వ సంవత్సరం లో ఫైనల్ వరల్డ్ కప్ మ్యాచ్ సౌత్ ఆఫ్రికా లో నిర్వహించబడినది. ఈ సంవత్సరం లో ఆస్ట్రేలియా మన భారత దేశం పై విజయం సాధించింది.
2007 వ సంవత్సరం లో ఫైనల్ వరల్డ్ కప్ మ్యాచ్ బ్రిడ్జ్ టౌన్ లో నిర్వహించబడినది. ఈ సంవత్సరం లో ఆస్ట్రేలియా శ్రీ లంక పై విజయం సాధించింది.
2011 వ సంవత్సరం లో ఫైనల్ వరల్డ్ కప్ మ్యాచ్ మన భారత దేశం లో నిర్వహించబడినది . ఈ సంవత్సరం లో మన భారత దేశం శ్రీ లంక పై విజయం సాధించింది.
2015 వ సంవత్సరం లో ఫైనల్ వరల్డ్ కప్ మ్యాచ్ ఆస్ట్రేలియా లో నిర్వహించబడినది. ఈ సంవత్సరం లో ఆస్ట్రేలియా న్యూ జిలెండ్ పై విజయం సాధించింది.
2019 వ సంవత్సరం లో వరల్డ్ కప్ ఎవరు గెలుస్తారో చూడాలి.

