ఎన్నికల్లో అతి దారుణంగా ఓడిపోయినా మన హీరోలు,హీరోయిన్స్ వీరే
మిగిలిన రంగాల కంటే సినిమా రంగానికి గల క్రేజ్ మాములుగా ఉండదు. ఎందుకంటే నటీనటులకు జనంలో ఉండే ఆరాధన చూస్తే, మాములుగా ఉండదు కదా. ఇక సినిమా వాళ్లకు రాజకీయాల్లోకి రావడం , రాజకీయాల్లో వాళ్ళు సినిమాల్లో నటించాలని ఉవ్విళ్ళూరడం చూస్తూనే ఉన్నాం. ఈ రెండు రంగాలకు గల అవినాభావ సంబంధం అంతాఇంతా కాదు. ఎన్నికల్లో పోటీ చేయడం కూడా సినీ సెలబ్రిటీలకు కొత్తకాదు. టిడిపి అభ్యర్థిగా బాలకృష్ణ హిందూపురం నుంచి, వైసిపి అభ్యర్థిగా రోజా నగరి నుంచి మరోసారి గెలిచి తమ సత్తా చాటారు. కర్ణాటక నుంచి సుమలత, మధుర నుంచి హేమమాలిని,గురుదాస్ పూర్ నుంచి సన్నీ డియోల్,ఆమెది నుంచి స్మృతి ఇరానీ, కిరణ్ కేర్ చండీఘర్ నుంచి విజయ కేతనం ఎగురవేశారు.
అయితే ఈసారి ఎన్నికలు చాలామంది సెలబ్రిటీలకు షాక్ ఇచ్చాయి అని చెప్పాలి. సినిమాలు వేరు,రాజకీయాలు వేరు అనే సహజ నానుడు సరిగ్గా అతికినట్లు ఈ ఎన్నికల్లో సినిమావాళ్ళ గ్లామర్ ఏమాత్రం పనిచేయలేదు. అదేదో తెలుగు హీరోలకే కాదు,అన్ని భాషల్లో కూడా సినీ సెలబ్రిటీలకు సార్వత్రిక ఎన్నికల్లో చుక్కెదురైంది. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమవరం,గాజువాక లనుంచి పోటీ చేయగా రెండు స్థానాల్లో ఆయన ఓటమి పాలయ్యారు. ఇక మెగాబ్రదర్ నాగబాబు నర్సాపురం పార్లమెంట్ నుంచి జనసేన పక్షాన బరిలో దిగి ఓటమి పాలయ్యారు. జనసేన పార్టీ పరంగా చూస్తే, కేవలం ఒక్కటంటే ఒక్క స్థానమే గెలుపొందింది.
తూర్పు గోదావరి జిల్లా రాజోలు ఎస్సీ నియోజకవర్గంలో జనసేన పాగా వేసింది. హీరోయిన్ మాధవీలత బిజెపి నుంచి పోటీచేసి ఓటమిపాలయింది. కర్ణాటక నుంచి పోటీ చేసిన ప్రకాష్ రాజ్ ఓటమి చెందాడు. ఇక తెలుగు తార అయినా,బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటిన మాజీ ఎంపీ జయప్రద రామ్ పూర్ నుంచి పోటీచేసి, ఓటమి పాలయ్యారు. ఇక నార్త్ ముంబయి నుంచి పోటీచేసిన నటి ఊర్మిళ కూడా ఓటమి చవిచూడక తప్పలేదు. పూనమ్ సిన్హా, వివి చక్రవర్తి కూడా ఓటమి చెందారు.

