సింగర్ మంగ్లీ కష్టాన్ని గుర్తించిన జగన్ …. ఏ పదవి ఇస్తాడు?
డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత కాంగ్రెస్ లో ఏర్పడిన పరిణామాల నేపథ్యంలో పార్టీ నుంచి బయటకు వచ్చి వైస్సార్ కాంగ్రెస్ నెలకొల్పి,పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తానని సంకేతాలు ఇచ్చారు. చేసిన సాయం మరువకుండా ఏదో ఒక విధంగా ఆదుకోవడం వైఎస్ ఫ్యామిలీకి అలవాటే కనుక జగన్ కూడా తమను ఆడుకుంటాడని చాలామంది భావించారు. దీంతో ఆయన వెంట ఎందరో నడిచారు. అందుకే జగన్ అంటే ఆ పార్టీ నేతలకు,కార్యకర్తలకు ఎంతో అభిమానం ఉంది. ఇక జగన్ పై కేసులు పెట్టి, జైలుకు పంపినప్పుడు జగన్ తల్లి విజయమ్మ,చెల్లి షర్మిల కూడా జగన్ లేని లోటు తీరుస్తూ, పార్టీని,కేడర్ ని ముందుకు నడిపించారు.
అయితే గత ఎన్నికల్లో ఓటమి చెందాక అధికారంలోకి వచ్చిన టీడీపీ ఎన్నికల హామీలు నెరవేర్చలేదంటూ జగన్ ధ్వజమెత్తుతూ వచ్చారు. ఎన్నో ఒడిడుకులు ఎదుర్కొన్న జగన్ కి పార్టీ నేతలు, జగన్ కుటుంబ సభ్యులతో పాటు సినీ ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు కూడా అండగా నిలిచారు. తెలుగు సినిమా పరిశ్రమలో థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీగా కామెడీ పండించి మంచి పేరు తెచ్చుకున్న కమెడియన్ పృథ్వి పార్టీలో చురుగ్గా వ్యవహరించడంతో పార్టీలో సముచిత స్థానం కూడా జగన్ కల్పించారు. ఎక్కడికక్కడ ప్రచారం చేస్తూ జగన్ సీఎం కావాల్సిన ఆవశ్యకత వివరించుకుంటూ పృథ్వి ముందుకు సాగాడు.
ముఖ్యంగా వ్యూహ కర్త ప్రశాంత్ కిషోర్ సపోర్ట్ తీసుకుని అధికారంలోకి రావడానికి మార్గం సుగమం చేసుకున్నాడు. రావాలి జగన్,కావాలి జగన్ పాట ఎంతో పాపులార్టీ ని కూడా సాధించుకుంది. ఇక సింగర్ మంగ్లీ గురించి కూడా చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లో పండుగ వచ్చిందంటే వినిపించే పాట సింగర్ మంగ్లీ దే. తెలంగాణ పాటతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈమె ఎన్నో ఆల్బమ్స్ చేసి తనకంటూ ఓ గుర్తింపు ,ఇమేజ్ తెచ్చుకుంది. ఈమె జగన్ అభిమాని కావడంతో ఎన్నికల ప్రచార సభల్లో జననేత జగనన్న,మననేత జగనన్న వంటి తన పాటలతో హోరెత్తించింది. మరి ఈమెకు జగన్ సముచిత స్థానం కల్పిస్తారన్న మాట వినిపిస్తోంది.

