Politics

అలీ ప‌వ‌న్ గురించి మాట్లాడకపోవటానికి కారణం ఇదే !

జనసేన అదినేత పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌ తో క‌మెడియ‌న్ అలీకి మ‌ధ్య గ‌త కొన్నేళ్లుగా మంచి అనుబంధం వుంది. ఎందుకంటే ప‌వ‌న్ సినిమాలో అలీ లేని సినిమాలు చాలా త‌క్కువే. అంత‌గా వారిద్ద‌రి మ‌ధ్య అనుబంధం ఏర్పడింది. అయితే తాజాగా వీరిమ‌ధ్య గ్యాప్ బాగా పెరిగిపోయింది. ఫలితంగా జనసేనలో చేరాల్సిన అలీ ఏపీ ఎన్నిక‌ల వేళ వైఎస్ ఆర్ సీపీ పార్టీలో చేరిపోయాడు. ఇలా చేరిపోవడం పట్ల అలీపై ప‌వ‌న్ ఘాటుగానే స్పందించారు. త‌న‌కి ఎంతో చేశాన‌ని, అవ‌స‌రానికి ఆదుకున్నాన‌ని ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌లో ప‌వ‌న్ వెల్ల‌డించారు.

పవన్ ఎన్నికల సభలో ఇలా చెప్పడం కూడా అలీని క‌లిచివేసింది. దీంతో ఓ వీడియో విడుద‌ల చేస్తూ, ప‌వ‌న్ నా కంటే జూనియ‌ర్ అని, త‌ను సినిమాల్లోకి రాక‌ముందు నుంచే నేను చాలా బిజీ ఆర్టిస్టున‌ని, త‌న‌కు ఎవ‌రి స‌హాయం పొందాల్సిన అవ‌స‌రం ఇప్ప‌టికీ రాలేద‌ని, ఎదుటి వ్య‌క్తి ముందు చేయి చాచే అవ‌స‌రం వ‌స్తే ఆ రోజు అలీ ఈ లోకంలోనే వుండ‌డ‌ని అలీ అనేశాడు. 

ఇక ఆ త‌రువాత ఎన్నిక‌లు జ‌రిగిపోవ‌డం, ఈ ఎన్నిక‌ల్లో పోటీచేసిన రెండు స్థానాల్లోనూ ప‌వ‌న్ ఓట‌మిపాలు కావ‌డం షరా మాములే. అయితే జ‌గ‌న్ ప్ర‌మాణ స్వీకారం చేసిన త‌రువాత మీడియా ముందుకు వ‌చ్చిన అలీ ప‌వ‌న్ గురించి అడిగితే పారిపోతున్నాడ‌ట‌. జ‌గ‌న్‌ని పులివెందుల పులి బిడ్డ అని ఆకాశానికి ఎత్తేసిన అలీ త‌న స్నేహితుడు ప‌వ‌న్ ఓట‌మిపై స్పందించ‌మంటే మాత్రం తప్పించుకున్నాడు.