Movies

చక్రవాకం నుండి ప్రీతి అమీన్ ఎందుకు తప్పుకుందో తెలుసా?

దూరదర్శన్ లో ఋతురాగాలు సీరియల్ ఎంతటి ఘనవిజయం అందుకుందో చెప్పక్కర్లేదు. డైరెక్టర్ మంజులనాయుడు ఆతర్వాత తీసిన చక్రవాకం బుల్లితెర సీరియల్ రంగంలో సరికొత్త ట్రెండ్ సృష్టించింది. అందుకే ఇంకా ఆడియన్స్ మదిలో నిలిచిపోయింది. ఇందులో నటించిన నటీనటులు పాపులర్ స్టార్స్ అయిపోయారు. చెరగని ముద్రవేసి ఐదేళ్లపాటు దిగ్విజయంగా సాగిన ఈ సీరియల్ తమిళ , కన్నడ,మళయాళ భాషల్లో కూడా అనువాదమై అక్కడ కూడా దుమ్మురేపింది. ముఖ్యంగా ఈ సీరియల్ లో నటించిన స్రవంతి ,ఇంద్ర పాత్రల్లో ఒదిగిపోయి నటించిన ప్రీతి అమీన్,ఇంద్రనీల్ వర్మ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యారు. 

చక్రవాకం ద్వారా స్టార్ గా మారిన నటి ప్రీతి అమీన్ అందులో అమాయకపు పాత్రలో చేసిన నటనకు ఆడియన్స్ నీరాజనం పట్టారు. తెలుగు అమ్మాయి కాదు. అయితే ఈమె హైదరాబాద్ లోనే పుట్టి పెరిగింది. నాన్న, గృహప్రవేశం,అలౌకిక వంటి మరికొన్ని తెలుగు సీరియల్స్ లో కూడా ఈమె నటించి మెప్పించింది. అంతేకాదు టివి షోస్ లలో,సినిమాల్లో కూడా నటించి తన సత్తా చాటింది. ఇక 2014లో అమెరికన్ సైకియాట్రిస్ట్ ని పెళ్ళాడి, అక్కడే సెటిల్ అయింది . అయితే విజయవంతంగా చక్రవాకం నడుస్తున్న సమయంలో అనూహ్యంగా తప్పుకుంది. ఇక సీరియల్ లో కూడా తరవాత జనరేషన్ స్టార్ట్ చేసేసారు. 

అయితే ప్రీతి తనంతట తాను తప్పుకోలేదని,ఆమెకు కోపం ఎక్కువ కనుక కావాలనే తప్పించారని పుకార్లు వ్యాపించాయి. అయితే జి సంస్థ నిర్వహించిన టాలెంట్ హంట్ లో పాల్గొనడం ద్వారా హిందీ ఇండస్ట్రీలో మంచి ఛాన్స్ లు వచ్చాయని ప్రీతి చెప్పుకొచ్చింది. హిందీలో వచ్చిన ఆఫర్స్ వదులుకోలేక,చక్రవాకంలో కొన్ని ఎపిసోడ్స్ చేసేసి మరీ యాజమాన్యానికి చెప్పి తప్పుకున్నానని చెప్పుకొచ్చింది. అయితే తెలుగులో చేసిన సీరియల్స్ కారణంగా హిందీలో నిలబడ్డానికి బాగా ఉపకరించిందని, తెలుగు అమ్మాయిని కాకున్నా, తెలుగు ఆడియన్స్ తనను బాగా ఆదరించారని ఆమె పేర్కొంటూ , ధన్యవాదాలు చెప్పింది. కాగా పెళ్లయ్యాక నాలుగేళ్ల గ్యాప్ తర్వాత ఇండియాకు వచ్చి ,మళ్ళీ నటనమీద దృష్టి పెట్టింది. తెలుగులో ఛాన్స్ లు వస్తే నటిస్తానని అంటోంది.