Movies

కొత్త లుక్ లో శివాజీ మ్యాటర్ ఏంటి… తెలిస్తే షాక్….???

ఇటీవల కాలంలో టివి 9రవిప్రకాష్,సినీనటుడు శివాజీల కేసు వ్యవహారం సంచలనం రేపుతోంది. మొత్తానికి రవిప్రకాష్ పోలీసుల ఎదుట చాలా సార్లు హాజరైనప్పటికీ శివాజీ ఆచూకీ మాత్రం దొరకడం లేదు. అయితే వడదెబ్బ కారణంగా ఇంట్లోనే ఉన్నానని ఎక్కడికి పోలేదంటూ శివాజీ బయటకు ఓ మెసేజ్ వదిలాడు. 

అయితే ఇప్పటివరకూ శివాజీ బయట ఎక్కడ కనిపించిన దాఖలాలు లేవు. కానీ ఇంటర్నెట్ లో ఓ కొత్త గెటప్ లో ప్రత్యక్షం కావడం ఆసక్తి రేకెత్తిస్తోంది. మీసాలు చిన్నగా ట్రిమ్ చేసి, చార్లీ ఛాంప్లిన్ గెటప్ లో కనిపిస్తున్న ఓ వీడియో తాజాగా వైరల్ అయింది. దీనికి సంబంధించిన వివరాలేవీ తెలియరాలేదు. ఓపక్క శివాజీ గెటప్ లు ఇలా కనిపిస్తూ , బయటకు మాత్రం శివాజీ కనిపించకపోవడంతో సోషల్ మీడియాలో ఏకిపారేస్తున్నారు. 

వడదెబ్బ తగ్గడానికి ఇన్ని రోజులు పడుతుందా అంటూ ట్రోల్స్ వేస్తున్నారు. ఇది వైద్య విద్య లో వింతగా ఉందని కొందరు సెటైర్లు వేస్తున్నారు. ఇలాంటి గెటప్ లతో కనిపించడమేనా అజ్ఞాతం వీడే ఉద్దేశ్యం ఏమైనా ఉందా అని జనాలు కామెంట్స్ పెడుతున్నారు. రవి ప్రకాష్ బెయిల్ పిటీషన్ వ్యవహారం కోర్టులో ఉన్నందున అది తేలాకా శివాజీ బయటకు వస్తాడన్న మాట వినిపిస్తోంది.